కేసీఆర్ తో గొడవలు పడే రోజులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు… ఈటల కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు హుషారుగా పాల్గొంటున్నారు.బీజేపీ జాతీయ నాయకులు ప్రధాని మోదీ, అమిత్ షా మరి కొంతమంది కీలక నాయకులు తెలంగాణలో పర్యటిస్తూ బహిరంగ సభలలో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో మంగళవారం సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ కాలనీలో బీజేపీ నేత హుజూర్ బాద్, గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్ ( Etela Rajender )కీలక వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి పదవికి పోటీగా వస్తాన్నాననే సీఎం కేసీఆర్ తనను బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) నుండి తనను వెల్లగొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ నుండి వచ్చాక కేసీఆర్ ( KCR )కి సవాలు చేసి హుజరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచినట్లు పేర్కొన్నారు.

ఈసారి గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోవడం గ్యారంటీ అని వ్యాఖ్యానించారు.తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రాజకీయ నేతతో గొడవ పెట్టుకోలేదని ఈటల స్పష్టం చేశారు.

కేసీఆర్ తో గొడవపడే రోజు వస్తుందని అనుకోలేదని అన్నారు.2017లో కేసీఆర్ తో గొడవ మొదలైందని అన్నారు.

ఇదే సమయంలో మల్లన్న భూ నిర్వాసితులను పట్టించుకోని వాళ్లే.నాపై పోటీ చేసే దమ్ము లేక బీజేపీని.

విమర్శిస్తున్నారు.భూ నిర్వాసితులను కేసీఆర్ కూలీలుగా చేశారని విమర్శించారు.

వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని భూ నిర్వాసితులకు ఈటల సూచించారు.

రాష్ట్రంలో బండి సంజయ్ రాజీనామా చేశాక బీజేపీ గ్రాఫ్ ఏమి తగ్గలేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

వీడియో: లండన్‌లో ఈ యువకుడు చేసిన పని చూసి అందరూ ఫిదా..