నేను పబ్లిక్ గా తప్పులు చేశాను.. సారా అలీఖాన్ కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సారా అలీ ఖాన్.

ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘సింబా’, ‘కేదార్‌నాథ్’ వంటి సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అక్షయ్ కుమార్, తమిళ హీరో ధనుష్ సరసన ‘అత్రంగి రే’ చేస్తోంది.

డిసెంబర్ 24న ‘జీ5’లో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు.

ఈ సందర్భంగా సారా అలీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సారా అలీ ఖాన్ మాట్లాడుతూ ఎవరైనా నా వైపు చూస్తున్నారు అంటే అందుకు గల కారణం నేను నిజాయితీగా ఉండడమే అని నేను గ్రహించాను.

ప్రతి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మాట మాట్లాడే ముందు నేనే ఏమి మాట్లాడుతున్నానో చెక్ చేసుకుని మాట్లాడటం చేయడం వల్ల పెద్దగా నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అందరిలాగే నేను కూడా ఎన్నో తప్పులు చేశాను అయితే వాటికి సాపేక్షంగా ఉంటుంది అని తెలిపారు.

"""/" / ఇకపోతే కొన్ని తప్పులను పబ్లిక్ గా చేశానని వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ వెల్లడించారు.

అలాగే సోషల్ మీడియా గురించి ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేశారు.కేవలం నేను నా మూడ్ మార్చుకోవడం కోసమే ఇన్స్టాగ్రామ్ లో వస్తుంటాను కానీ నా మూడ్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం రానని ఈ సందర్భంగా సారా అలీ ఖాన్ వెల్లడించారు.

పేరు చెప్పకుండా పూనమ్ సంచలన ట్వీట్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇబ్బందేనా?