ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలంటే ఇష్టం.. అనన్య నాగల్ల స్టోరీ వైరల్!
TeluguStop.com
మామూలుగా ఏ ఆడపిల్ల అయిన పెళ్లి చేసుకోబోయే వాడి గురించి మంచి మంచి క్వాలిటీస్ ఉండాలి అని కోరుకుంటారు.
నిజానికి అబ్బాయిలు కూడా అలాగే కోరుకుంటారు.ఇక సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం తమకు కాబోయే వాళ్ల గురించి క్వాలిటీస్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటారు.
ఇప్పుడు మరో బ్యూటీ అనన్య నాగల్ల కూడా తనకు కాబోయే వాడికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పేసింది.
ఇంతకు ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అనన్య నాగల్ల.
తెలంగాణ భాషతో అతి తక్కువ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలలో మంచి నటిగా నిలిచింది ఈ తెలుగు అమ్మాయి.
తన అందంతో మాత్రం యువతను కట్టిపడేసి తన వైపు మలుపుకుంది.తొలిసారిగా నటుడు ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అనన్య.
ఈ సినిమాలో మల్లేశం భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో అనన్య కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పవచ్చు.
"""/"/
ఇండస్ట్రీకి ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత సక్సెస్ అందుకొని ఇక్కడ వరకు చేరుకుంది.
ఆ తర్వాత ప్లే బ్యాక్ సిరీస్ లో నటించి అందులో కూడా మంచి గుర్తింపు అందుకుంది.
ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో అందరికీ తన అందాలతో ఒకేసారి షాక్ ఇచ్చింది.
తెలుగు అమ్మాయిగా పద్ధతిగా కనిపించిన అనన్య ఇప్పుడు గ్లామర్ షో తో బాగా పిచ్చెక్కిస్తుంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారి ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను నెట్టింట్లో పెట్టేసి అందరి దృష్టిలో పడుతుంది.
ఇక ఈ అమ్మడు నడుము అందాలతో మాత్రం యువతను కన్నార్పకుండా చేస్తుంది.దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
"""/"/
ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకున్నా కూడా.ఒక రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తుంది అని తెలిసింది.
ఈ బ్యూటీ తన సమయాన్ని ఎక్కువగా ట్రిప్స్, ఫోటో షూట్ లతో కాలక్షేపం చేస్తుంది.
ఇక అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది ఈ బ్యూటీ.ఇక తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.
అందులో ఒక నెటిజన్.నీకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి అని ప్రశ్నించగా.
ఏకపత్ని గా ఉండే అబ్బాయి అంటే చాలా ఇష్టం అని చెప్పింది.ఇక ఆమె కాబోయే వాడికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పటంతో ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
ఇక తన అభిమానులు మాకు ఆ లక్షణాలు ఉన్నాయి అంటూ.పెళ్లి చేసుకోటానికి మేం సిద్ధంగా ఉన్నాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.
బాలినేని కౌంటర్ : చెవిరెడ్డి అవి బయటపెట్టమంటారా ?