ప్రేక్షకులకు ఆ తెలివి వస్తుందని ఆశిస్తున్నా… అనసూయ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
బుల్లితెర యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అనసూయ( Anasuya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా( News Reader ) పనిచేసిన ఈమె అనంతరం బుల్లి యాంకర్ గా అవకాశాలను అందుకున్నారు.
జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి ఈమె యాంకరింగ్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు.
ఇలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ బుల్లితెర కార్యక్రమాల కోసం తనకు నచ్చని విషయాలను కూడా చేయాల్సి వస్తుందని, షోలలో నిజాయితీ లేదని షో రేటింగ్స్ కోసం నచ్చని పనులు కూడా చేయాల్సి వస్తుందని చెబుతూ ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యాను అంటూ చెప్పుకొచ్చారు.
"""/" /
ఇక బుల్లితెరకు ఈమె యాంకర్ గా దూరం కావడంతో ఎన్నోసార్లు అభిమానులు తిరిగి బుల్లితెరకు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అంటు తనని ప్రశ్నిస్తూ వచ్చారు.
అయితే ఇలా తనకు ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారి ఎప్పుడైతే బుల్లితెర షోస్ జెన్యూన్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాయో అప్పుడు తిరిగి ఎంట్రీ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు.ఇందులో భాగంగా ఓ అభిమాని అనసూయని ప్రశ్నిస్తూ బుల్లితెర రీ ఎంట్రీ గురించి అడిగారు.
"""/" /
తిరిగి అనసూయను ఇలాంటి ప్రశ్న అడగడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
నేను కూడా బుల్లితెరను చాలా మిస్ అవుతున్నాను.పెళ్లి తర్వాత ఒక అమ్మాయి పుట్టింటిని ఎలా మిస్ అవుతుందో తాను కూడా బుల్లితెరను అలాగే మిస్ అవుతున్నానని అయితే త్వరలోనే బుల్లితెరపై జెన్యూన్ కంటెంట్ తో ఒక షో ప్లాన్ చేసి తనకు ఆఫర్ ఇస్తారని ఆశిస్తున్నాను.
అలాగే ప్రేక్షకులు కూడా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో ఏది రియల్ ఏది రీల్ అని తేడా తెలుసుకునే తెలివి వస్తుందని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వీడియో: సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణిస్తున్న యూఎస్ మహిళకు షాక్..