8 నెలలుగా జీతాల్లేవ్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో బీసీ సంక్షేమ శాఖలో వివిధ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఔట్సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న సుమారు 54 మంది సిబ్బందికి గత 8 నెలలుగా జీతాలే లేక నానా అవస్థలు పడుతున్నారు.

ఔట్సోర్సింగ్ ద్వారా నియమితులైన వీరికి ఒక్కొక్కరికి రూ.12 నుంచి రూ.

15 వేల వరకు జీతాలు పడుతున్నాయి.కానీ,వారి జీతాలు వారికి నెలనెలా ఇవ్వడంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అలసత్వం వహించడంతో 8నెలల నుండి పూట గడవక,అత్యంత గడ్డు పరిస్థితిలో వర్కర్స్ కొట్టుమిట్టాడుతున్నారు.

ఎన్నిసార్లు అధికారుల దృష్టికి,ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో చేసేదిలేక చివరికి మీడియాను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిణిగా పనిచేస్తున్న అనసూర్యను వివరణ కోరగా మా దగ్గర పెండిగ్ లేదని,నాకు ఏమి సంబంధం లేదని,మే నెలలో బిల్లులను ఎంప్లాయిమెంట్ కు పంపడం జరిగిందని,అక్కడ క్లియరెన్స్ వస్తే ఇస్తామని చెబుతున్నారు.

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులను వివరణ కోరగా జిల్లా అధికారిణి నిర్లక్ష్యమని చెప్పటం కొసమెరుపు.

ఇదిలా ఉంటే బీసీ సంక్షేమ శాఖ అధికారిణి కావాలనే బీసీ సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలల నుండి జీతం లేకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని బాధిత సిబ్బంది ఆరోపిస్తున్నారు.

జిల్లాలో ఎన్ని బీసీ హాస్టల్స్ ఉన్నాయి,ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నారో కూడా తెలవని పరిస్థితిలో జిల్లా అధికారిణి ఉండటం గమనార్హం.

అయితే జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారిణిగా పని చేస్తున్న అనసూర్యా రూటే సపరేటు అంటూ వెల్ఫేర్ ఉద్యోగుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా జిల్లా ఉన్నాధికారులు ఎస్పీ తక్షణమే స్పందించి 8నెలలుగా జీతాల్లేక పస్తులుంటున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితిని అర్దం చేసుకొని పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వీడియో: కోర్టులో డివోర్స్ కేసు నడుస్తుండగా భార్యను ఎత్తుకెళ్లిన భర్త.. చివరికి..