నాన్న లేకుండానే పెరిగాను.. ఎలాంటి జ్ఞాపకాలు లేవు టబు ఎమోషనల్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న నటి టబు ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా వరుస అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఒకానొక సమయంలోతెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

సాధారణంగా ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తే పాత హీరోయిన్ లకు అవకాశాలు రావడం తగ్గుతుంది.

కానీ ఈమె మాత్రం వరుస అవకాశాలను అందుకుంటు ఐదు పదుల వయసులో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి టబు తన తండ్రి గురించి మాట్లాడుతూ.

ఎమోషనల్ అయ్యారు.ఈమె చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నట్టు వెల్లడించిన ఈమె చిన్నప్పటి నుంచి తాను ఒంటరిగానే పెరిగానని తెలియజేశారు.

"""/"/ తనకు తన తండ్రి ఇంటిపేరు మాత్రమే తోడుగా ఉందని తన తండ్రి మాత్రం తోడుగా లేకుండా చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరిగానని తెలిపారు.

ఇక తన సోదరి మాత్రం కొన్ని సందర్భాలలో తన తండ్రితో కలిసినప్పటికీ ఈమె మాత్రం ఎప్పుడూ కూడా తన తండ్రిని కలవలేదని అందుకే ఆయనతో నాకు ఎలాంటి జ్ఞాపకాలు లేవంటూ టబు ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈమె తన తండ్రి గురించి ఎప్పుడూ ఆలోచించి బాధపడిన సందర్భాలు లేవని చిన్నప్పటి నుంచి తాను ఒంటరిగా పెరిగి అందులోనే తన సంతోషం వెతుక్కున్నానంటూ మొదటిసారి తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ఇలా ఈమె తండ్రి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లిస్ట్ రెడీ అయ్యిందా ? వైసీపీ నాయకుల్లో పెరుగుతున్న టెన్షన్