నా సినీ కెరియర్లో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాను.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్?

నటి కిరీటి రాజేంద్రప్రసాద్ ఎన్నో తెలుగు సినిమాలలో నటించి హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ప్రస్తుతం ఈయన యంగ్ హీరోల సినిమాలలో పలు కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాజేంద్రప్రసాద్ తాజాగా మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

అనుకోని ప్రయాణం అనే సినిమా ద్వారా రాజేంద్రప్రసాద్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాజేంద్రప్రసాద్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.ఇండస్ట్రీకి కొత్తవాళ్లు వస్తేనే కొత్త కథలు వస్తాయని నమ్ముతూ ఉంటారు అలా నమ్మే వాళ్ళలో తాను ఒకరని, ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

ఇలా నా సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించాను.ఇలాంటి అద్భుతమైన సినిమాలలో అనుకొని ప్రయాణం కూడా ఒకటని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

ఈ సినిమాలో ఎంతో ఫన్ ఉంటుందని తెలియజేశారు.ఆ నలుగురు వంటి ఎన్నో సమాంతర చిత్రాలు మన ఇండియాలో వంద రోజులు పాటు థియేటర్లలో ప్రదర్శితమౌతూ ప్రేక్షకులను సందడి చేశాయి.

"""/"/ ఇలాంటి సినిమాలలో నటిస్తూ తాను ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నానని, నా నటన జీవితంలో అన్ని రకాల పాత్రలలో నేను నటించానని అందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ రాజేంద్రప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే అనుకోని ప్రయాణం వంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని,అప్పుడప్పుడు ఒక అద్భుతంలా వచ్చే సినిమా కథలలో ఈ అనుకోని ప్రయాణం ఒకటి అంటూ ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ఈ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.