Samantha : అదేంటి సమంత.. సినిమా ప్రమోషన్స్ లోనే చెప్పిన కష్టాలను మళ్లీ మళ్లీ చెప్తావ్?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
గత ఏడాది యశోద సినిమా( Yashoda Movie )తో ప్రేక్షకులను పలకరించిన సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా( Sakunthalam Movie )తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా సమంత తన జీవితంలో జరిగిన వ్యక్తిగత అంశాలపై పరోక్షంగా స్పందించింది.
"""/" /
ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ.నా జీవితంలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు.
నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది.నా జీవితంలో ఉన్న ఎత్తు పళ్లాలని పారదర్శకంగా అందరూ చూడవచ్చు.
కొంతమంది కొన్ని విషయాలను దాచిపెట్టడం ఫేక్ గా ఉండడం లాంటివి చేస్తారు.అలా చేయడం వాళ్లకే నష్టం.
వాళ్లకు తెలియకుండానే చాలా ఒత్తిడి వచ్చేస్తుంది.నాకు ఆ సమస్య లేదు.
ఎందుకంటే నా జీవితం తెరిచిన పుస్తకం అని తెలిపింది సామ్.నా దృష్టిలో ప్రేమకు అర్థం మారిపోయింది.
"""/" /
కానీ అది మంచిగానే ఇన్నాళ్లూ నేను ప్రేమనిచ్చాను.కానీ జీవితంలో తొలిసారి చాలా ప్రేమను చూస్తున్నాను.
గడిచిన 7-8 నెలలుగా నా ఫ్యాన్స్, ఫ్యామిలీ, సన్నిహితులు నాకు ఇస్తున్న ప్రేమ చాలా ఎక్కువ.
ఇంత ప్రేమను నేను జీవితంలో చూడలేదు అని చెప్పుకొచ్చింది సమంత.కాగా సమంత వ్యాఖ్యలపై స్పందించిన పలువురు నెటిజన్స్ అదేంటి సమంత సినిమా ప్రమోషన్స్ లో చెప్పిన మాటలనే మళ్లీ మళ్లీ చెబుతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదివరకే సినిమా ప్రమోషన్స్ లో ఈ కష్టాల గురించి చెప్పావు కదా మళ్లీ అదే విషయాల గురించి మాట్లాడుతున్నావు ఏంటి అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.