Nayanathara :అలా పిలిస్తే నాకు నచ్చదు.. నయనతార కామెంట్స్ వైరల్..!!
TeluguStop.com
లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కేవలం నయనతార ( Nayanathara ) మాత్రమే.
ఈమె సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ప్రస్తుతం నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్.
"""/" /
ఇక జవాన్ సినిమా ( Jawan Movie ) తో బాలీవుడ్ లో కూడా తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి అలా పిలిస్తే మాత్రం అస్సలు నచ్చదట.ఇక అది కొంతమంది బిరుదు అనుకుంటే ఆమె మాత్రం తిట్టినట్లు భావిస్తుందట.
మరి ఇంతకీ నయనతార కి ఎలా పిలిస్తే నచ్చదో ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
నయనతారని ( Nayanathara ) ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది అలాగే అభిమానులు అందరూ కూడా లేడి సూపర్ స్టార్.
లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు.కానీ లేడీ సూపర్ స్టార్ అని పిలవడం నయనతారకి అస్సలు ఇష్టం ఉండదట.
అలా పిలిస్తే తనను తిట్టినట్లు అనిపిస్తుంది అని నయనతార రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
అంతేకాదు జవాన్ సినిమా విడుదలయ్యాక ఇంకా ఎక్కువ మంది తనని ఆ పేరుతోనే పిలుస్తున్నారని, అలా వారి ప్రేమను దక్కించుకోవడం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ప్రస్తుతం నయనతార అన్నపూరిణి ( Annapoorani ) అనే సినిమాలో చేస్తోంది.
ఈ సినిమాలో నయనతార బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మాంసాహార వంటకాలు చేసే రెస్టారెంట్ ని పెట్టి తన కల నిజం చేసుకోవాలి అని భావిస్తుంది.
మరి తన కల నెరవేర్చుకునే సమయంలో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది ఈ సినిమాలో ఉన్న మెయిన్ స్టోరీ.
అకీరాను చూసి అది నేర్చుకున్నాను… చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!