Pokiri : పోకిరి సినిమా ఎందుకు ఆడిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు : పూరి జగన్నాథ్ 

మహేష్ బాబు( Mahesh Babu ) కెరియర్ లో అతిపెద్ద విజయం సాధించిన సినిమాగా పోకిరి( Pokiri ) ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

2006లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు పూరి తీసిన సినిమాల్లో కూడా ఒక అద్భుతమైన చిత్రంగా ఉండిపోయింది ఈ సినిమాకి ముందు సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా పోకిరి చిత్రం లాగా మరొక చిత్రం ఆడలేదని చెప్పాలి.

మహేష్ బాబు కెరియర్ లో కూడా ఇది ఒక మైలురాయి.ఈ సినిమా ను పూరి జగన్నాథ్ తో పాటు మంజుల ఘట్టమనేని సంయుక్తంగా నిర్మించగా కథ పూరి అందించాడు.

ఇలియానా హీరోయిన్గా నటించిన పోకిరి సినిమా విడుదల 17 ఏళ్లు అవుతుంది. """/" / అయితే పూరీ జగన్నాథ్( Puri Jagannath ) పోకిరి సినిమా విజయవంతం కావడంపై గల కారణాలను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే( Open Heart With RK ) లో ప్రస్తావించాడు.

నేను తీసిన అన్ని సినిమాల్లో పోకిరి కూడా ఒకటి దాని కోసం ప్రత్యేకమైన హోం వర్క్ చేయడం లాంటివి జరగలేదు అన్ని కథలు రాసుకున్నట్టుగానే పోకిరి కూడా మంచి కథ అనే రాసుకున్నాను కానీ అది ఇండస్ట్రీ హిట్ అవుతుందనే విషయం ముందుగా ఊహించింది కాదు.

పైగా ఈ సినిమా తర్వాత ఎన్నో చిత్రాలు తీసిన కూడా ఎందుకో పోకిరి లెవెల్ లో హిట్టు కావడం లేదని అందరూ అనుకుంటున్నారు కానీ నా దృష్టిలో అన్ని సినిమా కథలు ఒకటే.

విజయం సాధిస్తాయని ఉద్దేశంతోనే అన్ని రాస్తూ ఉంటాను అందులో కొన్ని హిట్ అవుతున్నాయి కొన్ని పోతున్నాయి.

"""/" / ఇక పోకిరి మాత్రమే ఎందుకు అంత పెద్ద విజయం సాధించింది తెలుసుకుందామని ఒకరోజు ప్రసాదు లాబ్స్( Prasad Labs ) లో సినిమా వేసుకొని మరోసారి చూశానని కానీ అందులో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని కానీ సినిమా విజయవంతం కావడం అనేది మన చేతుల్లో ఉండదని ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏ చిత్రం విజయం సాధిస్తుందో ప్లాప్ అవుతుందో ఊహించడం కష్టమంటూ పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోకిరి సినిమాలో మరోసారి విడుదల చేసినా కూడా వసూలు బ్రహ్మాండంగా వస్తాయి అని మహేష్ బాబు ఫ్యాన్స్ జోస్యం చెప్తున్నారు.

ప్రభాస్ 10 సంవత్సరాల వరకు నెంబర్ వన్ హీరోగానే కొనసాగబోతున్నాడా..?