కాంగ్రెస్ సంగతి నాకు తెలియదా.?: మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి( Minister Uttam Kumar Reddy ) బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ( Maheshwar Reddy )కౌంటర్ ఇచ్చారు.

మంత్రి ఉత్తమ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేఎల్పీ పదవి కొనుగోలు చేశారనడం సరికాదని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి ఉత్తమ్ గతంలో ఏ విధంగా పీసీసీ పదవి తెచ్చుకున్నారో తనకు తెలుసని చెప్పారు.

కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఆదేశాలతోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని తెలిపారు.

పుట్టింటి వివరాలు మేనమామకు తెలియదా అన్నట్లు కాంగ్రెస్ సంగతి తనకు తెలియదా అని ప్రశ్నించారు.

క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతిని ఆపే ప్రయత్నం చేశారా అని నిలదీశారు.22 వేల కోట్ల స్టాక్ ఉందంటున్నారు.

రూ.వేల కోట్ల నష్టాలున్నాయంటున్నారన్న మహేశ్వర్ రెడ్డి డీఫాల్ట్ లిస్ట్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

అదేవిధంగా డీఫాల్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీకి ఆలీ రాజీనామా.. వెనుక ఎంత పెద్ద కథ నడిచిందా ?