వారిలా చిల్లర డాన్సులు వేయను… కంగనా కామెంట్స్ వైరల్!
TeluguStop.com
బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా ఏం మాట్లాడినా పెద్ద ఎత్తున సెన్సేషనల్ అవుతూ ఉంటుంది.
ఇలా ఈమె ఏ విషయం అయినా ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటంతో ఈమె చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు తీవ్ర దుమారం రేపుతుంటాయి.
అయితే తాజాగా తన తల్లి గురించి మాట్లాడుతూ కంగనా చేసినటువంటి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను కొన్ని కోట్ల రూపాయలకు ఆస్తిపరురాలు అయినప్పటికీ తన తల్లి మాత్రం ఇప్పటికీ ఒక సాధారణ వ్యక్తి లాగే బ్రతుకుతున్నారని ఈమె తెలియజేశారు.
"""/" /
ఇలా ఉన్నఫలంగా ఈమె తన తల్లి ప్రస్తావన తీసుకురావడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే కంగనా ఓ ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఒక నెటిజన్ కామెంట్ చేయడంతో ఆ కామెంట్ కు రిప్లై ఇస్తూ.
నావల్ల మా అమ్మ ధనవంతురాలు కాదు ఇది గమనించండి నేను రాజకీయ, వ్యాపార, ప్రభుత్వ అధికారులు ఉన్న కుటుంబంనుంచి వచ్చాను.
మా అమ్మ దాదాపు 25 ఏళ్ల పాటు స్కూలు టీచర్‌గా పని చేశారు.
మరి నాకు ఈ యాటిట్యూడ్ ఎక్కడి నుంచో వచ్చిందో ఈ సినిమా మాఫియా గుర్తించాలని ఈమె కోరారు.
నేను ఎందుకు పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసే లాంటి చిల్లర పనులు చేయాలనీ ఈమె తెలిపారు.
"""/" /
తన తల్లితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన కంగనా ఇప్పటికి తన తల్లి పొలం పనులు చేసుకుంటూ ఉంటుందని తెలిపారు.
అందరిలా మా అమ్మ బయట తినడానికి విదేశాలలో తిరగడానికి ఏమాత్రం ఇష్టపడదు.నేను కనుక ఇలాంటి పనులు చేయమని తనని అడిగితే తాను తిడుతుందంటూ ఒక పోస్టులో తెలియచేశారు.
ఇక మరొక పోస్ట్ కూడా చేస్తూ.చెత్త సినిమాలు తీసే సినిమా మాఫియా పెళ్లిళ్లలో డ్యాన్సులు చేస్తుంది.
చిల్లర డబ్బుల కోసం ఐటమ్ సాంగ్స్ చేస్తుంది.వారికి నిజమైన మనుషుల గురించి తెలీదు.
సమగ్రత డబ్బు కంటే విలువైనది.అందుకే నేను వాళ్లను గౌరవించట్లేదు.
ఇకపై కూడా గౌరవించనుnకూడా అంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ ఈమె చేస్తున్నటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.