నేను వ్యవసాయం చేస్తాను కాబట్టే రైతుల బాధలు తెలుసు : కేసీఆర్

తాను స్వతహాగా రైతుని కాబట్టే రైతుల సమస్యలు తెలుసుకొని వారి అభ్యున్నతి కోసం ఇన్ని పథకాలు పెట్టానని, పిసిసి అధ్యక్షుడు రేవంత్( Revanth Reddy ) ఎప్పుడైనా పొలం దున్నాడా? ఆయనకు రైతుల బాధలు ఏం తెలుసని అందుకే 10 హెచ్పీ మోటర్లు పెట్టాలంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు కేసీఆర్.

( KCR ) కొడంగల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కెసిఆర్ రేవంత్ రెడ్డి ని కామారెడ్డి లోనూ కొడంగల్ లోనూ తుక్కుతుక్కుగా ఓడించాలన్నారు.

50 లక్షల లంచం ఇస్తూ అడ్డంగా దొరికిన రేవంత్ మళ్లీ నీతులు చెప్తారని జైల్లో చెప్పకూడు తిన్నా కూడా బుద్ది రాలేదని ఇటువంటి వ్యక్తికి మీరు ఓట్లు వేస్తే కొడంగల్( Kodangal ) గౌరవం తగ్గుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

"""/" / రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? పట్నం నరేందర్ రెడ్డి వచ్చిన తర్వాతే ఇక్కడ ఈ స్థాయి అభివృద్ధి జరిగిందని, కేటీఆర్( KTR ) ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని రోడ్లు, డిగ్రీ కళాశాల తీసుకొచ్చారని ,బస్సు డిపో తీసుకొచ్చారని, వట్టి మాటలు చెప్పే రేవంత్ కావాలా పని చేసి పెట్టే పట్నం నరేంద్ర( Patnam Narender Reddy ) కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి అన్నారు.

కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాము అనుకునే వ్యక్తులు 15 మందికి పైగా కాంగ్రెస్ లో ఉన్నారని కనీసం ఆ పార్టీకి 20 సీట్లు అయినా వస్తేనే కదా ముఖ్యమంత్రి గురించి ఆలోచించేదని ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడు అనే ఆశతో ఓట్లు వేయొద్దని అదంతా ఒట్టి గ్యాస్ అంటూ కేసిఆర్ వ్యాఖ్యానించారు.

మైనారిటీల అభివృద్ధి కోసం ఇప్పటివరకు రెండు వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ ఖర్చు పెడితే తామ పన్నెండు వేల కోట్లు ఖర్చు చేసామని, మైనారిటీల కోసం ఐటి పార్కులను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు .

తెలంగాణ వచ్చేనాటికి తలసరి ఆదాయం లక్షలోపు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తొమ్మిది సంవత్సరాలలో మూడు లక్షల పైగా పెరిగిందని, అలాగే విద్యుత్ వినియోగం కూడా 1100 నుంచి 2200 యూనిట్లకు పెరిగిందని ,దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలపాలనదే తన లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు.

వీడియో వైరల్‌: ఇదేందయ్యా ఇది.. బస్సుపై కాకులు టూర్ ప్లాన్ చేశాయా ఏంటి..?