బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే నాకు బిఆర్ఎస్ టికెట్ రాలేదు!

భారత రాష్ట్ర సమితి శాశ్వత సభ్యత్వానికి, అమెరికా అడ్వైజరీ బోర్డుకు రాజీనామా నియోజకవర్గం ప్రజలకు సేవ చేసేందుకు నా కుటుంబాన్నే వదులుకున్న కచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటాను మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి.

దీంతో ఈనెల 30న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar )సమక్షంలో బీఎస్పీలోకి చేరడం ఇక లాంచానమే అంటున్న ఆయన సన్నిహితులు!వేములవాడ మీడియా సమావేశంలో నియోజకవర్గ నాయకుడు డాక్టర్ గోళీ మోహన్ వ్యాఖ్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ఉద్యమంలో 2001లో నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రత్యేక రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా కెసిఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి ఆకర్షితునై పార్టీలో చేరడం జరిగిందని అప్పట్నుంచి తెలంగాణ ఉద్యమం తో పాటు దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐ గా రాష్ట్రస్థాపనకు తనవంతుగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వేములవాడ నియోజకవర్గ క్రియాశీలక నాయకుడు గోలి మోహన్ ( Goli Mohan )స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియమకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ విఫలం చెందడం తో పాటు వేములవాడ బీఆర్ఎస్ టికెట్ ఇస్తానని ఆశ చూపి చివరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిననే ఒకే ఒక కారణంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టారన్న కారణంతో నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియాతో తెలిపారు.

నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ద్వేయంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడుతున్నట్లు, తన గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషిచేసి అసెంబ్లీకి పంపించాలని వేడుకున్నారు.

ట్రంప్‌కే ఓటేయ్యండి.. ప్రవాస భారతీయులకు తులసి గబ్బార్డ్ పిలుపు