60 ఏళ్ళు వచ్చిన మీ ప్రేమను మరిచిపోలేను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన విజయ్!

విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా లైగర్.

ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో గుంటూరులో చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.నా సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ లైగర్ అని చెప్పుకొచ్చారు.

నా సినిమా పై నాకు పూర్తి నమ్మకం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి బాగా ఎంజాయ్ చేయాలని అనుకున్నాను.

ఈ విధంగా తాను మీ దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకున్న సమయంలోనే వరుస షెడ్యూల్స్ కారణంగా తనకు ఆరోగ్యం సహకరించలేకపోయిందని ఈయన పేర్కొన్నారు.

అయితే నేడు ఈ వేదికపై నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు గల కారణం కేవలం మీరిచ్చిన ప్రేమ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక్కడనే కాదు ఇండియాలో ఎక్కడికి వెళ్లినా అభిమానులు తనపై ఎంతో ప్రేమను చూపిస్తున్నారని ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు.

"""/"/ తాను భవిష్యత్తులో నటన మానేసిన తర్వాత ఇంట్లో కూర్చున్నప్పటికీ 60 ఏళ్ళు వచ్చిన ఈ 20 రోజులలో నేను పాల్గొన్న ఈవెంట్స్ మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానుల ప్రేమ గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఇలా మీరు చూపించిన ప్రేమకు మీకు ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలని అనుకున్నాను అలా మీరు జీవితంలో గుర్తుండిపోయే సినిమా మీకు ఇవ్వాలని భావిస్తున్నాను అందులో మొదటి ప్రయత్నమే ఈ లైగర్ అంటూ ఈయన స్పీచ్ ద్వారా అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారని చెప్పాలి.

ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సురేష్ ప్రొడక్షన్ మూవీలను రిలీజ్‌కి ఒక రోజు ముందే థియేటర్లలో వేస్తారట..??