రూ.900 డ్రెస్ ను 50 రూపాయలకు కొన్న నిహారిక.. ఏం జరిగిందంటే?

మెగా డాటర్ నిహారిక గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

పెళ్లి తర్వాత కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తూ నిహారిక యాక్టివ్ గా ఉంటున్నారు.

మరోవైపు సోషల్ మీడియాలో సైతం నిహారిక ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్ ను మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక మాత్రమే కావడం గమనార్హం.

అయితే నిహారిక నటించిన ఒక మనస్సు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

తాజాగా నిహారిక తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.తాను బేరం బాగా ఆడతానని పదో తరగతిలో ఢిల్లీ ట్రిప్ కు ఖాన్ బజార్ కు వెళ్లిన సమయంలో 900 రూపాయల డ్రెస్ ను కేవలం 50 రూపాయలకే కొన్నానని నిహారిక చెప్పుకొచ్చారు.

గంట సమయం బేరం ఆడి డ్రెస్ ధరను తగ్గించుకున్నానని నిహారిక పేర్కొన్నారు.ప్రస్తుతం నిహారిక ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింపును సొంతం చేసుకుని కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

సైరా నరసింహారెడ్డి సినిమాలో నిహారిక చిన్న పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. """/"/ పెళ్లి తర్వాత కూడా నిహారిక సినిమాల్లో కొనసాగుతారో లేదో చూడాల్సి ఉంది.

కొన్నిరోజుల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ కు సైతం నిహారిక హాజరు కాలేదనే సంగతి తెలిసిందే.

"""/"/ నిహారిక నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోయినా ఆమె నటించిన వెబ్ సిరీస్ లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

మెగా ఫ్యామిలీ గౌరవాన్ని పెంచే విధంగా నిహారిక పాత్రల ఎంపిక ఉండటం గమనార్హం.

నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

వరుణ్, నిహారిక ఒకే సినిమాలో నటిస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వీడియో కాల్‌లో భర్త ఉండగా ఫోన్‌ని పుణ్యజలాల్లో ముంచేసిన భార్య.. వీడియో చూస్తే నవ్వాగదు..