సీఎం జగన్ తో మీటింగ్ కు నన్ను ఎవరు పిలవలేదు.. హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్!

గత కొద్దిరోజుల నుంచి ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య టికెట్ల రేట్లు వ్యవహారం గురించి చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.

సినీ పరిశ్రమల సమస్యను వివరించడం కోసం ముఖ్యమంత్రిని చిరంజీవి ఒంటరిగా కలవడంతో వివాదం చెలరేగింది.

సినీ పరిశ్రమ గురించి ముఖ్యమంత్రితో మాట్లాడటం కోసం చిరంజీవి ఒక్కరే వెళ్లడం ఏంటి అంటూ ఎంతోమంది ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా తాజాగా మరోసారి చిరంజీవితో పాటు ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన విషయం మనకు తెలిసిందే సినిమా టికెట్లరేట్లను పెంచుతూ జీవో విడుదల చేస్తారని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి జీవో విడుదల కాలేదు.

ఇదిలా ఉండగా తాజాగా సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తాను 44 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని అయితే సీఎం జగన్ తో మీటింగ్ కు నన్ను ఎవరు ఆహ్వానించలేదని ఈ సందర్భంగా సుమన్ వెల్లడించారు.

ఒకవేళ నాకు ఆహ్వానం వచ్చినా, రాకపోయినా నా ఆవేదన మొత్తం బయ్యర్స్ గురించేనని సుమన్ తెలిపారు.

ఇండస్ట్రీ బాగుండాలి అంటే ముందు బయ్యర్స్ బాగుండాలి. """/"/ సినిమా పూర్తి అయిన తర్వాత నిర్మాతలు అధిక ధరలకు బయ్యర్స్ కి సినిమా అమ్మి, ఆ తర్వాత వారి గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఎంతోమంది అధిక నష్టాలను ఎదుర్కొని దారుణమైన పరిస్థితుల్లో చనిపోయిన వారు ఉన్నారని అలాంటి వారిని తానే స్వయంగా ఐదు మందిని దహనం చేశానని తెలిపారు.

ఇండస్ట్రీ బాగుండాలంటే ఒక బయ్యర్ మాత్రమే బాగుండాలి.అందుకే అందరూ కూర్చొని ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించాలని ఈ సందర్భంగా సుమన్ తెలిపారు.

అలా కాకుండా మనం ఇలాగే ప్రవర్తిస్తే ఇక కొద్ది రోజులకు బయ్యర్స్ ఎవరూ ఉండరని.

నిర్మాతలే వారి సినిమాలను విడుదల చేసుకోవాలని నాలుగైదు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే ఆ నిర్మాత పరిస్థితి కూడా ఇంతేనని సుమన్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

వీడియో: పట్టపగలే దారుణం.. నర్సింగ్ విద్యార్థిని గొంతు నులిమి చంపబోయిన ప్రేమోన్మాది..