టిక్‌టాక్ దెబ్బకి బోరుమంటున్న హ్యుందాయ్, కియా?

ప్రపంచాన్ని ఓ ఊపు ఊపి, వీడియో కంటెంట్ కి సరికొత్త నిర్వచనం చూపించిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్’ కు ఉన్న ఆదరణ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.

ఈ యాప్ సాయంతోనే గల్లీలో వున్న టాలెంట్ కూడా ఈరోజు వెలుగు చూసిందని చెప్పుకోవాలి.

ఈ క్రమంలో రాత్రికి రాత్రే స్టార్లుగా ఎదిగినవారు వారు ఎందరో ఉన్నారు.ఉదాహరణకు ఉప్పల్ బాలు, దుర్గా రావు, అగ్గిపెట్టి మచ్చ, ఆవేశం స్టార్ నరేష్.

ఇలాంటి వారెందరో ఈ యాప్ ద్వారా స్థిరపడ్డారు. """/"/ ఇకపోతే టిక్‌టాక్ యాప్ లో ఏదైనా ఒక వైరల్ అయ్యిందంటే దాని ప్రభావం కొన్ని వేల మందిపై వుంటుందనే విషయం చెప్పాల్సిన పనిలేదు.

ఒక వీడియోను ఛాలెంజ్ గా తీసుకొని.అచ్చం అలాంటి వీడియోలను మరికొందరు సృష్టించే విధానం ఇక్కడినుండి వచ్చింది.

ఈ ఫీచరే ప్రముఖ కార్ల కంపెనీలైన కియా, హ్యుందాయ్‌కి పక్కలో బల్లెంలాగా మారింది.

అవును.ఓ స్క్రూడ్రైవర్‌, USB కేబుల్‌ ఉంటే చాలు.

కారును సులువుగా దొంగిలించొచ్చంటూ కొందరు చేసిన వీడియోలు ఆ సంస్థలను నేడు కోలుకోలేని దెబ్బె కొడుతోంది.

"""/"/ ఇకపోతే గతేడాది అమెరికాకు చెందిన కొందరు వ్యక్తులు ‘కియా బాయ్స్‌’ పేరిట కియా, హ్యుందాయ్‌ కార్లే లక్ష్యంగా చేసుకుని కొన్ని వీడియోలు చేసారు.

ఈ క్రమంలో తాళం అవసరం లేకుండా కార్లను ఎలా స్టార్ట్‌ చేయొచ్చో ఆ వీడియోల్లో ప్రాక్టికల్ గా చేసి చూపించారు.

“మొదట స్క్రూడ్రైవర్‌ సాయంతో స్టీరింగ్‌ కింద ఉన్న ప్లాస్టిక్‌ బాక్సును తొలగించి. """/"/ USB కేబుల్‌ సాయంతో కార్లను స్టార్ట్ చేస్తున్నారు”.

ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో వందలాది యువకులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి వందల్లో దొంగతనాలు చేయడం కొసమెరుపు.

ఇంటి బయట, రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్లని తాళం సాయం లేకుండా ఎత్తుకెళ్లడమే ఈ ఛాలెంజ్.

ఈ క్రమంలో పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల బారిన పడినవారు కూడా వున్నారు.

దాంతో ఇది పెద్ద వివాదం అయిపోయింది కూడా.

అల్లు అర్జున్ కోసం పని చేసిన లాయర్ ఫీజు ఎంతో తెలుసా.. వామ్మో ఇంత తీసుకుంటారా?