నటి అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.ప్రతి ఒక్కరు హీరోయిన్ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకు వస్తారు.
కాని అవకాశం లేక కొంత మంది ప్రయత్నాలను విరమించుకుంటారు.ఇంకొంత మంది చిన్న చిన్న అవకాశాలు తోనే గుర్తింపు రాకుండానే పరిశ్రమ నుండి కనుమరుగైపోతారు.
కాని నటనలో సత్తా ఉండి హీరోయిన్ గా అవకాశం రాకున్నా యాంకర్ లుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఈ కోవలోకి వస్తారు నటి అనసూయ.ప్రస్తుతం జబర్దస్త్ షోతో ఒక్కసారిగా స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.
జబర్దస్త్ ద్వారా అందాల అరబోతతో ఒక్కసారిగా కుర్రకారుకు మట్టేక్కిచ్చిందని చెప్పవచ్చు.ఇక జబర్దస్త్ మాత్రమే కాకుండా అడపా దడపా సినిమాలలో కూడా నటిస్తూ నటిగా తానేంటో నిరూపించుకుంటోంది.
అయితే రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా రామ్ చరణ్ సరసన నటించిన విషయం తెలిసిందే.
రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడంతో ఇక అనసూయ స్థాయి బుల్లితెర నుండి వెండి తెరకు పాకింది.
తాజాగా అనసూయ హైపర్ ఆదికి బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ వీరిద్దరి కలయికగా వినూత్న రీతిలో ఓ వెబ్ సిరీస్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట.
అయితే అసలే కష్ట కాలంలో ఉన్న హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్ ఇవ్వడంతో ఆది అనసూయకు కృతజ్ఞతలు తెలిపాడట.