మరోసారి సుధీర్ ని టార్గెట్ చేసిన హైపర్ ఆది.. అక్కడేం లేక ఇక్కడికి వచ్చాడంటూ!?
TeluguStop.com
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
జబర్దస్త్ లో అడుగుపెట్టి చిన్న కమెడియన్ నుంచి స్టార్ కమెడియన్గా ఎదిగాడు.తన పంచులతో మాత్రం అందరినీ కడిగిపారేస్తాడు.
ఇక ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడాలంటే ముందుంటాడు ఆది.ఇతరులను నొప్పించకుండా వారిపై కౌంటర్ వేస్తుంటాడు.
ఇక జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షో లలో కూడా బాగా రెచ్చిపోతూ డైలాగులు కొడుతుంటాడు హైపర్ ఆది.
ఏదైనా ఈవెంట్ ఉంటే మాత్రం అక్కడ కూడా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసిన డైలాగులు కొడుతుంటాడు.
ఇక ఈయన వేసే పంచులకు అక్కడున్న కమెడియన్స్ తో పాటు జడ్జీలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
కానీ ఆయన మాత్రం ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో నేరుగా అర్థమవుతుంది.అప్పుడప్పుడు తోటి కమెడియన్స్ అని కూడా చూడకుండా వారి వ్యక్తిగత విషయాలపై కూడా డైలాగులు కొడుతూ ఉంటాడు.
గతంలో ఈయన ఒక స్కిట్ ద్వారా ప్రేక్షకుల మనసులను గాయం చేయటంతో వెంటనే ఈయనకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
అయినా కూడా అలాగే రెచ్చిపోతుంటాడు ఆది.అయితే ఇదంతా పక్కన పెడితే.
తాజాగా సుడిగాలి సుధీర్ ని మరోసారి టార్గెట్ చేశారు. """/"/
మరో స్టార్ కమెడియన్ సుధీర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఈయన బుల్లితెర స్టార్ గా మారాడని చెప్పవచ్చు.ఎందుకంటే ఈయనకు ఉన్న ఫాలోయింగ్ అటువంటిది.
ఈయన ఏ షో లో ఉన్నా కూడా ఆ షో రేటింగ్ అంతకుమించి దూసుకుపోతుంది.
అయితే ఈయన గతంలో ఈటీవీ నుండి మరో ఛానల్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.
దీంతో ఆ సమయంలో ఆయన అభిమానులు చాలా ఫీలయ్యారు.మళ్లీ ఈటీవీలో అడుగు పెట్టాలి అని కోరారు.
కానీ ఆ సమయంలో హైపర్ ఆది సుడిగాలి సుధీర్ ని ఘోరంగా అవమానించాడు.
స్కిట్లో భాగంగా సుధీర్ పేరు వాడకుండా ఆయన వెళ్లిపోయిన విషయాన్ని మరోలా వెటకారంగా చేస్తూ స్కిట్ చేశాడు.
అయితే ఆ సమయంలో సుధీర్ అభిమానులు ఆయన స్కిట్ ను గమనించి అతడి పై బాగా ఫైర్ అయ్యారు.
"""/"/
ఇదిలా ఉంటే సుధీర్ మరోసారి ఈటీవీలో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో మరోసారి సుధీర్ పై ఆది పంచ్ వేసాడు.ఇక తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా అందులో ఆది ఒక స్కిట్ చేయగా అందులో.
ఒక కమెడియన్ ఇక్కడ ఫేమ్ సంపాదించుకున్నవారు పక్క రాజ్యాలకు ఎందుకు వెళ్తున్నారని అనడంతో.
అక్కడేదో ఉంటుందని అన్నాడు ఆది.మరి మళ్లీ తిరిగి ఇక్కడికే ఎందుకు వస్తున్నారని కమెడియన్ అనగా.
అక్కడేం లేదని తెలుసుకొని అంటూ కౌంటర్ వేసాడు.దీంతో ఇది సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీని ఉద్దేశించే ఆయన అలా కామెంట్స్ చేసాడని సుధీర్ అభిమానులు ఆది పై ఫైర్ అవుతున్నారు.