ఏపీ ఎన్నికల ప్రచారంలో జనసేన తరఫున హైపర్ ఆది( Hyper Adi ) ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పలుచోట్ల సభలో మరియు కొన్నిచోట్ల రోడ్ షోలలో పాల్గొంటున్నారు.ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గెలుపు కోసం హైపర్ ఆది కొంతమంది జబర్దస్త్ టీం ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా హైపర్ ఆది వైసీసీ పార్టీపై( YCP Party ) సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
వైసీపీ అధికారంలోకి వస్తే మధ్య నిషేధం చేస్తామని చెప్పారు చేశారా అని నిలదీశారు.
పెన్షన్ ₹3000 ఇస్తామని ఇచ్చారా అని ప్రశ్నించారు.అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది ఎవరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏమీ చేయలేదు. """/" /
కామెడీ అంతా వాళ్ళు చేస్తే మమ్మల్ని అంటే ఎలా అంటూ నిలదీశారు.
మేమంతా జస్ట్ ప్రొఫెషనల్ కమెడియన్స్.వారిలాగా పొలిటికల్ కమెడియన్స్ కాదు అని పేర్కొన్నారు.
నేను బీటెక్ చదువుకున్నాను నాకు అన్ని విషయాలపై అవగాహన ఉంటే తప్ప ఏం మాట్లాడను.
ఇక ముద్రగడ( Mudragada ) చేసిన వ్యాఖ్యలపై కూడా కౌంటర్ ఇచ్చారు.ఎంతమంది ముద్రగడలు వచ్చినా పిఠాపురంలో( Pithapuram ) పవన్ కళ్యాణ్ గెలుపును ఎవరు ఆపలేరని వ్యాఖ్యానించారు.
అంతే కాదు పవన్ గెలిస్తే ఆయన పేరు మార్చుకుంటారన్నారు.కచ్చితంగా ముద్రగడ పద్మనాభం పేరు మారుతుందని స్పష్టం చేశారు.
జరగబోయే ఎన్నికలలో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని హైపర్ ఆది విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్23, బుధవారం2025