ఫుల్లుగా తాగొచ్చి స్టేజ్ పై రచ్చ చేసిన హైపర్ ఆది… అసలేం జరిగిందంటే?
TeluguStop.com
హైపర్ ఆది( Hyper Aadi ) పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఉన్నటువంటి ఈయన అనంతరం టీం లీడర్ గా మారిపోయారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హైపర్ ఆది అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) కార్యక్రమం తో పాటు ఢీడాన్స్ షో( Dhee Dance Show ) కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను నవ్వించారు.
ప్రస్తుతం ఈయన జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకుండా మిగిలిన రెండు షోలలో సందడి చేస్తున్నారు.
అలాగే మరో వైపు సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. """/" /
ఇక ఈ మధ్యకాలంలో ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా కూడా అందులో హైపర్ ఆది తప్పనిసరిగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు.
ఇలా కెరియర్ పరంగా వెండితెర పైన బుల్లితెర పైన ఎంతో బిజీగా ఉన్నటువంటి హైపర్ ఆది తాజాగా ఢీ వేదిక పైకి మందు బాటిల్ చేతిలో పట్టుకొని రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమోలో భాగంగా దీపిక పిల్లి ( Deepika Pilli ) అఖిల్ ను తీసుకొని రావడంతో ప్రదీప్( Pradeep ) ఎవడీడు అని అడిగేసరికి మా బావ అంటూ సమాధానం చెబుతుంది ఆ క్షణమే శేఖర్ మాస్టర్ ( Sekhar Master ) ఇంకొక ఆయన ఏడి అంటూ ఆదిని ఉద్దేశించి అడిగారు.
"""/" /
శేఖర్ మాస్టర్ ఇలా అడిగేసరికి హైపర్ ఆది మందు బాటిల్ చేతిలో పట్టుకొని వచ్చారు.
ఇలా మందు బాటిల్ చేతిలో పట్టుకొని స్టేజ్ పైకి వస్తావా అంటూ శేఖర్ మాస్టర్ అనడంతో నీ ప్రాబ్లం ఏంటి అని అది అన్నారు దీంతో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ షాక్ అయ్యారు.
ఆది మాటలకు కంగు తిన్న శేఖర్ మాస్టర్ ఫస్ట్ టైం తాగినట్టు ఉన్నారు అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అనడంతో ఎవడికోయ్ ఫస్ట్ టైం.
5 సీజన్ ల నుంచి తాగుతున్నాను.ఆ గుట్టు తెలుసా నీకు తెలుసా అంటూ ఆది చాలా ఫన్నీగా యాక్ట్ చేయడంతో అందరికీ నవ్వు తెప్పించింది.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రేవతి మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేయడం రైటేనా.. నెటిజన్ల అభిప్రాయమిదే!