రష్మీ పరువు తీసేసిన హైపర్ ఆది.. చేతిలో అవే ఎక్కువగా ఉన్నాయంటూ?
TeluguStop.com
ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది పంచ్ లలో గతంతో పోల్చి చూస్తే పవర్ తగ్గినా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.
బుల్లితెర, వెండితెర ఆఫర్లతో బిజీగా ఉన్న హైపర్ ఆది ఆ ఆఫర్ల ద్వారా ఆస్తులను బాగానే కూడబెట్టారని సమాచారం అందుతోంది.
నిన్న ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో హైపర్ ఆది రష్మీపై పంచ్ లు పేల్చగా ఆ పంచ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్మీ హైపర్ ఆదితో తన చెయ్యి చూసి ధనరేఖ ఎలా ఉందో చెప్పాలని అడగగా చేతిలో గీతల కంటే ముడతలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆది రష్మీ పరువు తీసేశాడు.
ధనరేఖ విషయానికి వస్తే ఇప్పుడు తగ్గిందని ఆది కామెంట్ చేశారు.గురువారం కూడా యాడ్ అయితే ధనరేఖ బాగా పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత హైపర్ ఆది బుల్లెట్ భాస్కర్ జాతకం చూసి ఆ ఈవెంట్లకు, ఈ ఈవెంట్లకు వెళ్లి నీ ఆయుష్షు ఆరు సంవత్సరాలు తగ్గిపోయిందని అన్నారు.
ఆ తర్వాత దొరబాబు జాతకం గురించి చెబుతూ నీ జాతకం చూడటం కంటే నా జాతకం నేను చూసుకోవడం బెస్ట్ అని హైపర్ ఆది కామెంట్లు చేశారు.
"""/"/ ఆ తర్వాత హైపర్ ఆది నువ్వు పుట్టిన సమయంలో మీ నాన్న నీ జాతకం చూడలేదని అందుకే దొరబాబు అనిపేరు పెట్టాడని జాతకం చూసి ఉంటే దొరుకుతాడు బాబు అని పెట్టేవాడని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.
ఆది చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/"/
హైపర్ ఆది రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని సమాచారం అందుతోంది.
ఇతర ఛానెళ్లకు హైపర్ ఆది గెస్ట్ గా హాజరవుతున్నా ఈటీవీ షోలకు మాత్రమే పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆదికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024