11 అంటే చాలా గుర్తొస్తాయి… హైపర్ ఆది మాస్ ర్యాగింగ్.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్?
TeluguStop.com
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSRCP ) కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన సంగతి మనకు తెలిసిందే గత ఎన్నికలలో 151 సీట్లతో అత్యధిక మెజారిటీ సాధించిన ఈ పార్టీ ఈసారి 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
మరోవైపు పొత్తులో భాగంగా బిజెపి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇలా వైఎస్ఆర్సిపి పార్టీ 11 సీట్లకే పరిమితం కావడంతో పలువురు ఇప్పటికీ ఈ పార్టీ ఘోర పరాజయంపై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
"""/" /
ఇలా సెటైర్లు వేస్తూ కామెంట్లు చేసే వారిలో హైపర్ ఆది ( Hyper Aadi ) ముందు వరుసలో ఉంటారు.
ఈయనకు ఎక్కడ సందు దొరికితే అక్కడ వైసిపి పార్టీపై సెటైర్లు వేస్తూ కామెంట్లు వచ్చేస్తున్నారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా జబర్దస్త్ షో అయిన సినిమా ఈవెంట్ అయినా వైసీపీ పార్టీపై తనదైన శైలిలోనే సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా నిహారిక( Niharika ) నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు ( Comitte Kurrollu ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ ఇన్ డైరెక్ట్ గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్ల గురించి సెటైర్లు వేశారు.
"""/" /
నిహారిక కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మాదిరిగా ట్రెండ్ ఫాలో అయ్యే రకం కాదు ట్రెండ్ సెట్ చేసే రకం అని తెలిపారు.
11 మంది హీరోలను పెట్టి సినిమా చేసింది అంటే నిజంగానే ట్రెండ్ సెట్ చేసినట్లే.
11 మంది హీరోలంటే ఇప్పుడు రీసెంట్‌గా ఇండియాకి 11 మంది క్రికెటర్లు వరల్డ్ కప్ తెచ్చినట్లు.
ఈ 11 మంది హీరోలు నిహారిక గారికి గొప్ప విజయాన్ని తేవాలని కోరుకుంటున్నాను.
ఇక 11 అంటే మనకు ఇంకా ఏవేవో గుర్తొస్తుంటాయి అంటూ ఈయన పరోక్షంగా వైసీపీ గెలుచుకున్న సీట్ల గురించే ఈ కార్యక్రమంలో మాట్లాడటంతో వైసీపీ ఫాన్స్ ఆది వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ కు వచ్చిన మెజారిటీ గురించి కూడా గుర్తించుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదేందయ్యా ఇది.. ఆ దేశంలో పారాసెటమాల్ కలిపిన ఐస్‌క్రీమ్ అమ్ముతారు..?