స్ట్రెస్ తగ్గాలంటే హగ్ చేసుకోవాల్సిందే… ఆఫ్రికా అమ్మాయితో రొమాన్స్ చేసిన ఆది?
TeluguStop.com
తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ( Hyper Aadi ) ఒకరు.
హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అయితే ఈ కార్యక్రమం నుంచి ఈయన బయటకు వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు ఢీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇక పండుగలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాలలో హైపర్ ఆది హంగామా మామూలుగా ఉండదని చెప్పాలి.
"""/" /
ఇలా బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నటువంటి హైపర్ ఆది తాజాగా తాను ఆఫ్రికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటూ ఒక అమ్మాయిని అందరికీ పరిచయం చేశారు.
అయితే ఇదంతా కూడా స్కిట్ లో భాగం అని తెలుస్తుంది.ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama Company ) కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది తన భార్య అంటూ ఆఫ్రికా అమ్మాయిని అందరికీ పరిచయం చేశారు.
ఇక ఈమె నేను ఒత్తిడికి గురయ్యాను అంటే చాలు హగ్ ఇస్తుంది అంటూ తన చేత హాగ్ ఇప్పించుకున్నారు.
"""/" /
ఇక హైపర్ ఆది దొరికిందే ఛాన్స్ కదా అంటూ మాటిమాటికీ నేను ఒత్తిడికి గురయ్యాను అంటూ తన చేత హగ్ తీసుకుంటూ ఉన్నారు.
ఇలా ఈయన కామెడీ పండించినప్పటికీ ఇలాంటి కార్యక్రమాలను చూసే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఉంటారు కనుక వారికి మాత్రం ఇలాంటి సన్నివేశాలు పెద్దగా నచ్చలేదని తెలుస్తుంది.
దీంతో హైపర్ ఆది హగ్గు కోసం మరి దిగజారి పోతున్నారు అంటూ పలువురు ఈయనపై ఈయన స్కిట్ల పై విమర్శలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.
ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాతో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారుతాడా..?