రాజకీయాలలోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవి అందుకోబోతున్నారా?

జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు హైపర్ ఆది( Hyper Aadi ) .

జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో ఈయన స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసేవారు అనంతరం కమెడియన్ గా కొనసాగే వారు.

ఇక అది పంచ్ డైలాగులు ఎంతో అద్భుతంగా ఉన్న నేపథ్యంలో ఈయన ఈ కార్యక్రమంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు.

ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హైపర్ ఆది ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఇటీవల రాజకీయాలలో( Politics ) కూడా కాస్త బిజీగా మారిపోయారు.

ముఖ్యంగా సినీ నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్థాపించిన జనసేన పార్టీ( Janasena Party ) కి మద్దతు తెలియజేశారు.

గత కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికలలో ఏకంగా ఈయన ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా పవన్ కళ్యాణ్ విజయానికి ఎంతగానో దోహదం చేశారు.

"""/" / ఇక ఈయన ఏ కార్యక్రమానికి వెళ్లిన రాజకీయాల గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు.

ఇలా రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉన్నటువంటి హైపర్ ఆది త్వరలోనే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

జూలై 1వ తేదీ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నారని అంతేకాకుండా జనసేన పార్టీలో హైపర్ ఆది కీలక పదవి అధిరోహించబోతున్నారని తెలుస్తోంది.

"""/" / ఇప్పటికే జనసేన పార్టీ విజయానికి ఎంతగానో దోహదం చేసిన హైపర్ ఆది జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని అందుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈయన గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

గతంలో కూడా జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే పోటీ చేయడానికి తాను సిద్ధమేనని ఆది కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

గొప్ప మనసు చాటుకున్న మంచు హీరో ….120 మంది దత్తత తీసుకున్న విష్ణు!