అమ్మాయిల హాస్టల్ లో ఉండేవాడిని.. హైపర్ ఆది ఇన్ని అవమానాలు పడ్డారా?

బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో కమెడియన్ హైపర్ ఆది ( Hyper Aadi )ఒకరు.

ఈయన కెరియర్ మొదట్లో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో స్క్రిప్ట్ రైటర్ గా పని చేశాడు.

ఇలా స్క్రిప్ట్ రైటర్ పని చేస్తున్నటువంటి ఈయన అదిరే అభి టీం లో కమెడియన్ గా కొనసాగారు.

అయితే ఆది పంచ్ డైలాగులు అందరిని కడుపుబ్బా నవ్వించడంతో ఈయనకు ఏకంగా టీం లీడర్ గా ఎంపిక చేశారు.

ఇలా టీం లీడర్ గా జబర్దస్త్ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైనటువంటి స్కిట్లు చేసినటువంటి ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ ఇతర మల్లెమాల వారి కార్యక్రమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఇలా వరుస కార్యక్రమాలలో బిజీగా ఉన్నటువంటి ఈయన సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంత బిజీ ఉన్నటువంటి అది ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని పలు సందర్భాలలో తెలియచేశారు.

ఒక ఇంటర్వ్యూలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ కెరియర్ మొదట్లో తాను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని తాను లేడీస్ హాస్టల్ ( Ladies Hostel )లో ఉంటూ ఎంతో ఇబ్బందులు పడ్డానని తెలిపారు.

"""/" / హైదరాబాద్ వచ్చిన మొదటిలో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉండేవి.అయితే మా బంధువులు ఒకరు లేడీస్ హాస్టల్ పెట్టారు నేను కూడా అక్కడే ఉండేవాడిని.

హాస్టల్ పైన ఉండగా కింద ఒక గది ఉండేదని నేను అక్కడ ఉండే వాడినని తెలిపారు అయితే హాస్టల్లో అమ్మాయిలందరూ భోజనం చేయడానికి కిందకు వస్తున్నప్పుడు తాను ఎన్నో ఇబ్బందులు పడేవాడిని.

వారు భోజనానికి వచ్చేముందు నేను గది లోపలికి వెళ్లిపోయి అసలు బయటకు వచ్చేవాడిని కాదు లేదంటే బయటకు వెళ్ళిపోయే వాడినని తెలిపారు.

"""/" / వారందరూ భోజనం చేసి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చేవాడినని తెలియజేశారు.

ఇలా అమ్మాయిలందరూ భోజనం కోసం కిందకు వస్తున్నప్పుడు నేనేంటి ఇలా అమ్మాయిల హాస్టల్ లో ఉన్నాను అని ఎన్నో సందర్భాలలో అవమానంగా ఫీల్ అయ్యానని హైపర్ ఆది తెలిపారు.

అయితే తాను జబర్దస్త్ లో సెకండ్ లీడ్ కమెడియన్ గా చేసినప్పటి నుంచి ఫైనాన్షియల్ గా నిలదొక్కుకున్నానని ఆది తెలిపారు.

ఇక ప్రస్తుతం ఈయన టాప్ కమెడియన్ గా కొనసాగుతూ ఇటు వెండితెర పైన బుల్లితెర పైన ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నారు.

శ్రీకాంత్ ఓదెల చిరంజీవి సినిమాలో ఫ్యాక్షన్ ఎపిసోడ్స్ కనిపించబోతున్నాయా..?