నరేష్ పవిత్రల మళ్లీ పెళ్లిపై సెటైర్లు వేసిన హైపర్ ఆది.. అలాంటి కామెంట్లు చేస్తూ?
TeluguStop.com
నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్( Pavitri Lokesh, Actor Naresh ) ల గురించి మనందరికీ తెలిసిందే.
గత కొంతకాలంగా ఈ జంట పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.
తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటారు.ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఈ జంట వార్తల్లో నిలుస్తూ ఉంటారని చెప్పవచ్చు.
అయితే మొన్నటి వరకు ఈ జంట పేర్లు వినిపించకపోయేసరికి హమ్మయ్య అంటూ నెటిజన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
కానీ తాజాగా మరోసారి ఈ జంట పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. """/" /
అందుకు గల కారణం తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది( Jabardast Comedian Hyper Adi ) ఈ జంటపై చేసిన కామెంట్స్.
త్వరలోనే వినాయక చవితి పండుగ రానున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వినాయక చవితి అనే ఒక ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
తాజాగా ఆ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.ఆ ప్రోమోలో హైపర్ ఆది నరేష్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు.
నాకు ఒక పెళ్లే అవ్వట్లేదు.పెళ్లి, మళ్లీపెళ్లి ఎలా సార్? అని హైపర్ ఆది స్టేజీపై నరేశ్‌ని అడిగగా.
పక్కనే పవిత్రా లోకేశ్ ఉండడంతో ఈ క్రమంలోనే ఈ క్వశ్చన్‌కి నరేశ్ నవ్వి ఊరుకున్నాడు.
ప్రోమో కాబట్టి పెద్దగా రివీల్ చేయలేదు.హైపర్ ఆది వేసిన ప్రశ్నకు నరేష్ ఏ విధంగా సమాధానం ఇచ్చాడు.
"""/" /
ఆ తర్వాత ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు చూడాల్సిందే మరి.
ఇకపోతే నరేష్ పవిత్ర లోకేష్ కలిసిన నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఇటీవలే విడుదల అయ్యి విమర్శల పాలైన విషయం తెలిసిందే.
నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి( Ramya Raghupathi ) ఈ ఈ విషయంలో కోర్టు ని కూడా ఆశ్రయించింది.
ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్స్ హైపర్ ఆది పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఈ మధ్యకాలంలో హైపర్ ఆదికి పొగరు అహంకారం ఎక్కువ అయిపోయాయి.చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై సెటైర్లు వేస్తూ ఉంటాడు అంటూ హైపర్ ఆది పై మండిపడుతున్నారు.
Cool Bet Im Überblick: Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten