హగ్గులకు ఏడ్చాం ముద్దులకు ఏడ్చామన్న హైపర్ ఆది.. కరువులో ఉన్నాడంటూ?
TeluguStop.com
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కామెడీ టైమింగ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
హైపర్ ఆది ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలో కనిపించకపోయినా ఢీ షోలో మాత్రం కనిపిస్తున్నారు.
హైపర్ ఆది టైమింగ్ వల్లే ఢీ షో రేటింగ్స్ పెరుగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైపర్ ఆది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.హైపర్ ఆదికి క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.
తాజాగా ఢీ షో ప్రోమోలో ఛత్రపతి సినిమాలోని ఒక్క అడుగు డైలాగ్ కు పేరడీ చేస్తూ డైలాగ్ చెప్పడం గమనార్హం.
హగ్గులకు ఏడ్చాం ముద్దులకు ఏడ్చామంటూ ఆది చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.నువ్వు ప్రభాస్ అనడానికి ఒక్క సాక్ష్యం చూపించు అని ప్రదీప్ అడగగా ఈ మెడలో గవ్వ చూశావా అంటూ హైపర్ ఆది కామెంట్ చేశారు.
గవ్వ చూశావా అని మళ్లీ ఆది చెప్పగా గవ్వ పగులుతుంది ఇంకోసారి అలా చెబితే అని ప్రదీప్ వెల్లడించారు.
"""/" /
శ్రియ క్యారెక్టర్ కు బాగా సెట్ అయ్యానా అని అమ్మాయి అడగగా శ్రియనా ఇది నేనింకా సూరీడు అని పిలిచే క్యారెక్టర్ అనుకున్నానని ఆది పేర్కొన్నారు.
ఈ సెట్ లో హగ్గులకేడ్చాం ముద్దులకేడ్చాం మా కరువు హద్దులు దాటింది శేఖర్ మాస్టర్ పోతే జానీ మాస్టర్ జానీ మాస్టర్ పోతే గణేష్ మాస్టర్ ఇలా ఎవరైనా శ్రద్ధా జోలికి వస్తే అని హైపర్ ఆది డైలాగ్ చెప్పగా జెస్సీ తాను చెప్పాల్సిన డైలాగ్ ను మరిచిపోతాడు.
"""/" /
ఆ తర్వాత నీ శ్రద్ధ కాదురా నా శ్రద్ధ అని జెస్సీ కామెంట్ చేశారు.
ఆ తర్వాత శ్రద్ధా దాస్ హైపర్ ఆదిని చూస్తూ నిన్నేనా నేను చూస్తుంది నిన్నేనా సాంగ్ పాడారు.
ఆ తర్వాత హైపర్ ఆది శ్రద్ధా దాస్ కు ఐ లవ్ యూ చెప్పారు.
ఈ ప్రోమోకు ఏకంగా 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
హైపర్ ఆది కామెంట్లు విని ఆది కరువులో ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.