హైపర్ ఆదిని బావ అన్న ప్రియమణి.. బ్రేక్ ఫాస్ట్, లంచ్ అంటూ ..?
TeluguStop.com
బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన ఢీ షో ప్రేక్షకాదరణ పొందుతున్న షోగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పటివరకు ఢీ 12 సీజన్లు విజయవంతంగా ప్రసారం కాగా ప్రస్తుతం ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ పేరుతో 13వ సీజన్ ప్రసారమవుతోంది.
తాజాగా విడుదలైన ప్రోమోలో స్కిట్ లో భాగంగా హైపర్ ఆది ప్రియమణితో కలిసి మాల్దీవులకు వెళ్లారు.
ఆది ప్రియమణితో ఇలాంటి అవకాశం మళ్లీ రాదు అని చెప్పగా ప్రియమణి అవును బావా అంటూ ఆది చేతిలో చెయ్యి వేస్తారు.
ఆ తరువాత సుడిగాలి సుధీర్ పూర్ణతో కలిసి ఎంట్రీ ఇస్తాడు.ఆది ప్రతిసారి వీళ్ల ఎంట్రీ ఏంటి ప్రియ అనగా సుధీర్ మీరే మేము ఎక్కడ ఉంటే అక్కడికి వస్తున్నారని చెబుతాడు.
మీరు బయట ఉంటారా.? లేక బీచ్ దగ్గరకు వెళతారా.
? సుధీర్ ఆదిని అడగగా ఆది మీరేం ప్లాన్ చేశారు అని సుధీర్ ను అడుగుతాడు.
అందుకు సుధీర్ మేము బయటికి రాము అని చెబుతాడు.ఆది ప్రియమణితో నీకు ఇడ్లీ కావాలా.
? దోశ కావాలా.? అని అడగగా నీకేది ఇష్టమైతే అది తీసుకురావాలని ప్రియమణి చెబుతుంది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/06/hyper-aadi-and-sudigaali-sheer-went-the-males-tour-with-priyamani-and-poorna-in-dhee-show!--jpg "/
మాల్దీవులు వచ్చి దోశ పెడతారా బావా.? నాకు వేరే బ్రేక్ ఫాస్ట్ కావాలి అని ప్రియమణి చెప్పగా నేను అదే అడుగుతున్నానని ఆది చెబుతాడు.
సుధీర్ నాకు ఫ్రాన్స్ కావాలని పూర్ణ అడగగా నా దగ్గర ఆదిలా బ్రేక్ ఫాస్ట్ లు లేవు మనది అంతా మెయిన్ కోర్సే అని సుధీర్ వెల్లడిస్తాడు.
ఆ తర్వాత ప్రదీప్ రూమ్ సర్వీస్ అంటూ ఎంట్రీ ఇచ్చి మేడమ్ వాళ్ల బాయ్ ఫ్రెండ్ వస్తానని చెప్పారు రాలేదా సార్ అని అడుగుతాడు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/06/hyper-aadi-and-the-sudigaali-sheer-went-males-tour-with-priyamani-and-poorna-in-dhee-show!--jpg "/
ఆది నేనే మేడమ్ బాయ్ ఫ్రెండ్ ను అని చెబుతాడు.
ఆ తరువాత సుధీర్ ఆదితో కాయిల్ ఉందా.? దోమలు కుడుతున్నాయ్ అంటాడు.
దోమలైనా అది పెడితే పోతయ్ నువ్వు కుట్టేదానికి ఏం పెట్టాలో చెప్పు అంటూ ఆది పంచ్ వేస్తారు.
ఎన్ని చేసిన చుండ్రు పోవడం లేదా.. అయితే ఇదే మీకు సొల్యూషన్!