కరీంనగర్ కాంగ్రెస్లో హైడ్రామా..!!
TeluguStop.com
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో( Karimnagar Congress Party ) హైడ్రామా నెలకొంది.ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు( Velichala Rajender Rao ) నామినేషన్ దాఖలు చేశారు.
ఈ నామినేషన్ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావు వెంట మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) ఉన్నారు.
వెలిచాన నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.అయితే కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ నెల 25వ తేదీన కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రవీణ్ రెడ్డి( Praveen Reddy ) కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అధికారికంగా ప్రకటించకపోయినా నామినేషన్ వేయడం కరీంనగర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వీడియో వైరల్: మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన టీమిండియా క్రికెటర్