మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్‌ వాటర్‌బైక్‌.. అదిరిపోయే ఫీచర్లు ఇవే!

వాటర్‌బైక్‌లు గురించి మీరు వినే వుంటారు.ఇవి ఎంతోకాలనుండి వాడుకలో వున్నాయి.

అయితే ఇప్పటి వరకు వాడుకలో ఉన్న వాటర్‌బైక్‌లన్నీ పెట్రోల్‌ లేదా డీజిల్‌ ఇంధనంగా ఉపయోగించుకుని నడిచేవి.

అయితే ఇపుడు కెనడాకు చెందిన ‘ఎన్వో’ కంపెనీ తొలిసారిగా పూర్తిగా విద్యుత్తుతోనే పనిచేసే 1500 వాట్ల మోటారుతో వాటర్‌బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇది మిగిలిన ఎలక్ట్రిక్‌ వాహనాల మాదిరిగానే రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది.ఒకసారి చార్జింగ్‌ చేసుకుంటే, గంటసేపు నిరాటంకంగా జలవిహారం చేయవచ్చు అని కంపెనీ ప్రతినిధులు తాజాగా ఓ మీడియా సమావేశంలో తెలిపారు.

హైడ్రా వాటర్ బైక్‌గా పిలువబడే ఈ వాహనం ఆన్-ది-వాటర్ ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ టెస్టింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసిందని, దాంతో తదుపరి దశకు తీసుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

ఇది తేలికపాటి గొట్టపు అల్యూమినియం ఫ్రేమ్ మరియు డ్యూయల్ గాలితో కూడిన పాంటూన్‌లను కలిగి ఉంటుంది.

దీని యొక్క మొత్తం బరువు 50 Kg కంటే తక్కువగా ఉంటుంది.అలాగే ఇది గరిష్టంగా 120 కిలోల (265 పౌండ్లు) వినియోగదారు/కార్గో లోడ్‌ను తీసుకెళ్లగలుగుతుంది.

ఇకపోతే రైడర్ తిరిగి ల్యాండ్ అవ్వకముందే ఛార్జ్ అయిపోతే, పెడల్ పవర్‌ని ఉపయోగించి బైక్‌ను మందికి కదిలించవచ్చు.

అలాగే నీటిలో ఇది గంటకు ఇరవై కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించగలదు.అలాగే దీనికో ఓ ప్రత్యేకత ఉంది.

మిగిలిన వాటర్‌ బైక్‌లతో పోల్చుకుంటే దీని బరువు కాస్త తక్కువే అని చెప్పుకోవాలి.

సరదా జలవిహారాలకు ఇది భేషైన వాహనం.ముఖ్యంగా ఇది పర్యాటకులను విశేషం ఆకర్షిస్తోంది.

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసకు షాక్..?