‘ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్సే దిక్కు ! తెలంగాణ భవన్ కు వారంతా క్యూ 

తెలంగాణలో ' హైడ్రా '( HYDRA ) వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో పాటు, అనేక సంచలనాలకు,  వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఎఫ్.

టి.ఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా దూకుడుగా ముందుకు వెళుతుంది.

బడా పారిశ్రామికవేత్తలు,  సినీ ప్రముఖులు,  రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు ఇలా ఎవరిని వదిలిపెటకుండా అక్రమ నిర్మాణం ఉన్న ప్రతి చోటకి హైడ్రా బుల్ డోజర్లు వెళ్తున్నాయి.

దీంతో ఏ రోజు ఏ నిమిషంలో హైడ్రా సిబ్బంది వచ్చి తమ ఇళ్లను కూలుస్తారో అనే టెన్షన్ తో జనాలు ఉంటున్నారు.

  ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నారు అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

"""/" / ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది .ఈ కూల్చివేతల్లో ఎక్కువమంది సామాన్య,  మధ్యతరగతి వారే ఉండడంతో, కాయ కష్టం చేసి కూడబెట్టిన దాంతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని , ఇప్పుడు వాటిని కూల్చివేయడంతో తమ పరిస్థితి ఏమిటి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన , సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీరు పైన హైడ్రా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ,  బిఆర్ఎస్సే తమకు దిక్కు అంటూ తమ ఆవేదనను చెప్పుకునేందుకు హైడ్రా బాధితులు తెలంగాణ భవన్ కు ఈరోజు చేరుకున్నారు .

మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను( KTR ) కలిసి తమ బాధ చెప్పుకునేందుకు తెలంగాణ భవన్ కు హైదరాబాధితులు వచ్చారు.

"""/" / అక్రమ నిర్మాణాలకు కూల్చివేతతో బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు హైడ్రా పేరుతో తమ ఇళ్ళ ను కూల్చివేస్తారనే భయంతో కూకట్ పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మ హత్య చేసుకుంది.

తమ ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుందని మనస్థాపనతో ఉరివేసుకొని మహిళ బలవన్మరణానికి పాల్పడింది.అయితే ఈ ఘటంతో హైడ్రా కి సంబంధం లేదని కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.

ఇక హైడ్రా బాధితుల కు అండగా ఉంటామని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది.  ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలబడి వారి తరఫున పోరాటాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటుంది .

హైడ్రా అంశాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఆలోచనతో బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.

వైరల్ వీడియో: క్లీన్ షేవ్, నో లవ్, గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలంటున్న అమ్మాయిలు