క్రికెట్ ఆడుతుండగా హైదరాబాదీ ఎన్నారైకి గుండెపోటు.. నిమిషాల్లోనే మృతి..!

గల్ఫ్ ప్రాంతంలో( Gulf Region ) యువకులు గుండెపోటుతో బాధపడుతున్న కేసులు పెరిగిపోతున్నాయి.

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ప్రజల కంటే చిన్న వయస్సులోనే గల్ఫ్ దేశాలలోని ప్రజలు గుండె జబ్బులతో బాధపడుతున్నారు.

ఇది చాలామందిలో ఆందోళనను రేకెత్తిస్తోంది.తాజాగా ఒక చిన్న వయసులోనే గుండెపోటు వల్ల మరణించాడు.

ఈ దుర్ఘటన మరింత మందిలో భయం కలిగించింది. """/" / వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ హృదయ దినోత్సవం ( World Heart Day )నాడు సౌదీ అరేబియాలో అతిఫ్ ఖాన్( Atif Khan ) అనే ఓ హైదరాబాదీ ఎన్నారై క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.

క్రికెట్ మ్యాచ్ ఆడటం మొదలుపెట్టినప్పుడు అతిఫ్ ఖాన్ బాగానే ఉన్నట్లు కనిపించింది.కానీ కొద్దిసేపటికి అతనికి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది.

ఆ పెయిన్ భరించలేక అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు.ఇది చూసి తోటి ప్లేయర్స్ షాక్ తిన్నారు.

అతిఫ్ ఖాన్‌ను హుటాహుటిన సమీపంలోని క్లినిక్‌కి తీసుకెళ్లారు, కానీ అక్కడ సరైన వైద్యం ఉంది దాన్ని తెలిసి ఆసుపత్రికి తరలించారు కానీ దురదృష్టం కొద్దీ అతను అప్పటికే కన్నుమూశాడు.

"""/" / అతిఫ్ ఖాన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు, వీరంతా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

ఖాన్‌కు సరైన సమయంలో సీపీఆర్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అల్ ఖోబర్‌లోని డాక్టర్ అభిజీత్ వెర్గీస్ అన్నారు.

ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, ప్రతి సెకను ముఖ్యమైనది.సీపీఆర్ అనేది ప్రాణాలను రక్షించే టెక్నిక్.

వ్యక్తి ఛాతీపై నొక్కడం, నోటిలోకి గాలిని ఊదడం ద్వారా రక్తం ప్రవహించేలా చేయడం ఈ టెక్నిక్ లో ముఖ్యమైన పనులు.

ఇలా చేయడం ద్వారా మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ అందుతుంది.సీపీఆర్ త్వరగా ప్రారంభించడం వల్ల వ్యక్తి బ్రతికే అవకాశం ఉంది.

హిట్ సినిమాను రిజెక్ట్ చేసి ఫ్లాప్ సినిమాలో నటించిన సాయితేజ్.. ఏ సినిమా అంటే.?