గోవా డ్రగ్స్ కేసులో హైదరాబాద్ వర్సెస్ గోవా పోలీసులు

గోవా డ్రగ్స్ కేసు దర్యాప్తులో హైదరాబాద్ పోలీసులు వర్సెస్ గోవా కాప్స్ గా ఉంది.

ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తి అయిన డిసౌజాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఎడ్విన్ అరెస్ట్ పై సస్పెన్స్ నెలకొంది.ఎడ్విన్ ను అరెస్ట్ చేసేందుకు అతడి నివాసానికి హైదరాబాద్ పోలీసులు వెళ్లారు.

అయితే ఎడ్విన్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ అనుచరులు రిపోర్ట్ చూపించారు.దీంతో ఆ రిపోర్ట్ ను ల్యాబ్ లో వెరిఫై చేయించగా ఫేక్ అని తేలింది.

ఇదే విషయాన్ని హైదరాబాద్ పోలీసులు.గోవా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో అది ఫేక్ రిపోర్టు అని తామే కనిపెట్టామని, ఎడ్విన్‌పై ఫోర్జరీ కేస్ కూడా నమోదు చేసినట్లు గోవా పోలీసులు చెప్పారు.

వైరల్ వీడియో: డ్రోన్ షోలో పిట్టల్లా రాలిన డ్రోన్లు