హైదరాబాద్: కస్టమర్‌కి షాక్.. బిర్యానీలో చనిపోయిన బల్లి ప్రత్యక్షం..
TeluguStop.com
ఈరోజుల్లో రెస్టారెంట్స్, హోటల్స్ తయారు చేస్తున్న ఆహారాలు బొద్దింకలు, బల్లులు తదితర కీటకాలు వస్తువు కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.తాజాగా మరొక షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది.
ఒక వ్యక్తి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ప్రముఖ బావర్చి రెస్టారెంట్ నుంచి ఆన్‌లైన్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా, అందులో చనిపోయిన బల్లి కనిపించింది.
దాంతో కస్టమర్ కంగుతున్నాడు.వివరాల్లోకి వెళితే, అంబర్‌పేటలోని డీడీ కాలనీలో నివసిస్తున్న విశ్వా ఆదిత్య ఫుడ్ డెలివరీ యాప్ అయిన జొమాటో( Zomato ) ద్వారా చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశాడు.
అతను, అతని కుటుంబం కొంత బిర్యానీ తిన్న తర్వాత చనిపోయిన బల్లి కనిపించింది.
దాంతో తీవ్ర ఆందోళనకు గురైన సదరు కస్టమర్ వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని సంప్రదించాడు, అయితే వారు నిర్లక్ష్యంగా స్పందించారు.
ఈ సంఘటనకు బాధ్యత వహించడానికి నిరాకరించారు. """/" / బిర్యానీలో బల్లి( Lizard )ని చూపిస్తూ విశ్వ ఆదిత్య సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజన్ల పెద్ద ఎత్తున విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను ఉల్లంఘించిన రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
జొమాటో ఇలాంటి రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుందని మరికొందరు ఫైర్ అయ్యారు.
"""/" /
యాప్‌లోని కస్టమర్ సర్వీస్ వింగ్ అయిన జొమాటో కేర్ ఒక పోస్ట్‌కు రిప్లై ఇచ్చింది.
ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే, రెస్టారెంట్ లేదా యాప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదా క్షమాపణలు జారీ చేయలేదు.
గతంలో హైదరాబాద్( Hyderabad )లోని మెరిడియన్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీలో బొద్దింక ఉన్నట్లు కస్టమర్ ఆరోపించాడు.
ఎక్స్ హ్యాండిల్‌లో బొద్దింక ఫోటోను కూడా షేర్ చేశాడు.ఇంకా వెలుగులోకి రాని ఇలాంటి ఘటనలు ఎన్నో.
అందుకే బయట ఫుడ్ తినే ముందు జాగ్రత్త వహించడం మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.
హెయిర్ బ్రేకేజ్ తో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టండి!