చైన్ స్నాచర్స్ కోసం హైదరాబాద్ పోలీసుల వేట
TeluguStop.com
చైన్ స్నాచర్స్ కోసం హైదరాబాద్ పోలీసుల ముమ్మరంగా గాలిస్తున్నారు.20 బృందాలుగా ఏర్పడిన పోలీసులు దుండగుల కోసం వెతుకున్నారు.
రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు గంటన్నర వ్యవధిలోనే ఆరు చైన్ స్నాచింగ్స్ జరిగాయి.
ఆరు చోట్ల మొత్తం 21 తులాల బంగారం దోచుకున్నారని తెలుస్తోంది.రామ్ కోటిలో బైక్ దొంగతనం చేసిన దుండగులు అదే బైకుపై తిరుగుతూ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.
అనంతరం పారడైజ్ దగ్గర బైక్ వదిలేసి కాచిగూడ రైల్వేస్టేషన్ వైపు ఆటోలో వెళ్లిపోయారు.
అంతకుముందు రోజు బెంగళూరులో చైన్ స్నాచింగ్స్ జరిగాయని వెల్లడించారు.నిందితులు యూపీకి చెందిన పింకు, అశోక్ గా గుర్తించారు.
నాగచైతన్య శోభిత పెళ్లికి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వబోతున్న నాగార్జున… ఎన్ని కోట్లో తెలుసా?