హైదరాబాద్ :- రాజాసింగ్ ను అరెస్టు చేసిన పోలీసులు....

తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారు అర్థం కావడం లేదని రాజాసింగ్ మండిపడుతున్నారు.తన వీడియోలో తాను ఏ ధర్మము గురించి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం మునావర్ ఫారుకి గురించి మాట్లాడానని ఆయన అన్నారు.

తెలంగాణలో బిజెపి బలపడుతుందని మాట్లాడే గొంతులను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సహాయంతో ఆపే ప్రయత్నాలు చేస్తుందని ఆయన ఆరోపణ చేశారు.

ధర్మం కోసం నేను ముందుకు వెళ్తున్నాను దాని రక్షణ కోసం చావడానికైనా సిద్ధమని రాజాసింగ్ స్పష్టం చేశారు.