హైదరాబాద్ మెట్రో ఉగ్యోగుల సమ్మె..!

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు.వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ టికెటింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించారని తెలుస్తోంది.

ఇవాళ సగం సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు.ఉద్యోగుల సమ్మెతో ఇప్పటికే మెట్రోపై ఎఫెక్ట్ పడింది.

సమ్మె ప్రభావంతో మియాపూర్ - ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లలో టికెట్ వ్యవస్థ స్తంభించింది.

ఐదేళ్లుగా తమకు వేతనాలు పెంచలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఐదేళ్లుగా రూ.

11 వేలు జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రూ.

15 వేల నుంచి రూ.118 వేల వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.