ఘరానా మోసం : లాటరీ పేరుతో రూ. 5.54 లక్షలను స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు..

ఘరానా మోసం : లాటరీ పేరుతో రూ. 5.54 లక్షలను స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

రోజురోజుకూ మోసాలు ఎక్కువవుతున్నాయి.మోసపోయే వారు ఉన్నంతకాలం మోసాలు జరుగుతూనే ఉంటాయని పెద్దలు చెబుతుంటారు.

ఘరానా మోసం : లాటరీ పేరుతో రూ. 5.54 లక్షలను స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

ఈ మాటలు నిజంగా నిజమే.ప్రజలకు ఆశచూపి వారిని అమాయకులను చేసి వారిని నిలువునా దోపిడీ చేస్తున్నారు.

ఘరానా మోసం : లాటరీ పేరుతో రూ. 5.54 లక్షలను స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

తెలియని వాళ్ళు ఫోన్ చేసినా.మెసేజ్ లు పంపినా వారికి రియాక్ట్ అవ్వకుడదని పోలీసులు ఎంత చెప్పినా ప్రజల్లో మార్పు రావడం లేదు.

నిరక్షరాస్యులైతే పోనీ వారికి తెలియక మోస పోయారేమో అని అనుకోవచ్చు.కానీ బాగా చదువుకుని ఉన్నత స్థానాలలో ఉన్న వారు కూడా మోసపోతూనే ఉన్నారు.

తాజాగా హైద్రాబాదులో ఒక వ్యక్తిని మోసం చేసి 5 లక్షల 54 వేలు స్వాహా చేసారు.

అమెజాన్ లో లాటరీ తగిలిందంటూ ఒక వ్యక్తిని మోసం చేసారు.లాటరీలో 60 వేలు విలువ చేసే టీవీ గెలుచుకున్నారంటూ ఆ వ్యక్తి దగ్గర నుండి భారీ స్థాయిలో వసూలు చేసారు.

హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

ఫిబ్రవరి 12 న శ్రీనివాస్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది.ఫోన్ చేసిన అతను నేను అమెజాన్ నుండి ఫోన్ చేస్తున్నాను.

మీరు 60 వేల రూపాయలు విలువ చేసే టీవీని లాటరీలో గెలుచుకున్నారు.నేను మీకు పంపించిన లింక్ క్లిక్ చేసి మీ వివరాలను ఫిల్ చేయమంటూ అందుకోసం మీరు 5 వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఫోన్ కట్ చేసాడు.

"""/"/ శ్రీనివాస్ ఇదంతా నిజమే అని నమ్మి ఆ లింక్ ఓపెన్ చేసి వివరాలను ఫిల్ చేసాడు.

అవి ఫిల్ చేస్తున్న సమయంలో ఆ చార్జీలు ఈ ఛార్జీలు అంటూ ఏకంగా 5 లక్షల 54 వేల రూపాయలు చెల్లించాడు.

ఇలా డబ్బులు కట్టించుకున్న ప్రతి సారీ మీ డబ్బు మొత్తం టీవీ మీకు డెలివెరీ చెయ్యగానే రిటర్న్ వస్తుంది.

మీ నుండి అమెజాన్ కేవలం 5 వేలు మాత్రమే తీసుకుంటుందని మెసేజ్ వచ్చేది.

డబ్బంతా చెల్లించిన తర్వాత మీకు టీవీ త్వరలోనే అందుతుందని చెప్పాడు.అయితే చాలా రోజులైనా టీవీ రాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన శ్రీనివాస్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

ఈ డబ్బంతా చెల్లి పెళ్లి కోసం తాను కష్టపడి కూడబెట్టుకుందని నా డబ్బు నాకు అందేలా చూడండంటూ పోలీసులకు విన్నవించుకున్నాడు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మంచు విష్ణు కన్నప్ప మూవీ తో సక్సెస్ కొడతాడా..?