హైదరాబాద్ కవాడిగూడ బాలిక మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
TeluguStop.com

హైదరాబాద్ లోని కవాడిగూడ బాలిక మిస్సింగ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.


సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలో కవాడిగూడలో బాలిక ఆటో ఎక్కినట్లు సీసీ టీపీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు.


స్నేహపురి కాలనీలో బాలిక ఫోన్ సిగ్నల్ ను ట్రేస్ చేశారు.దీంతో కాలనీలో విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు ఆటో డ్రైవర్ ను గుర్తించి విచారించనున్నారు.
అయితే బాలిక మానసిక స్థితి సరిగా ఉండదని తల్లిదండ్రులు వాపోతున్నారు.తమ బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చాలని కోరుతున్నారు.
పాకిస్తానీ పాస్‌పోర్ట్‌తో అమెరికాలోకి అక్రమంగా.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భారతీయుడు