హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు.. నిందితులు అరెస్ట్
TeluguStop.com
హైదరాబాద్ జూబ్లీహిల్స్( Jubilee Hills ) లో హిట్ అండ్ రన్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు.
ఈ మేరకు డ్రైవర్ తో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో నలుగురు యువకులతో పాటు ఓ యువతి ఉందని తెలుస్తోంది.
అలాగే ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్( SR Nagar Police Station ) కు తరలించారు.
నిన్న బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
అయితే ప్రమాదం చోటు చేసుకోవడానికి ముందు కారులో ఉన్న యవతీ, యువకులు పార్టీ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైరల్ వీడియో: పాముతో పరచకాలు చేస్తే.. రిజల్ట్ ఇట్లే ఉంటది మరి