పోలీసుల అదుపులోకి హైదరాబాద్ కరోనా బాబా

కరోనా మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వారి దరికి చేరకుండా వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తున్నారు.

అయితే, ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని కొందరూ అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కరోనా బాబా వెలిశాడు.

తనకు అతిత శక్తులున్నాయని, తన మాయలు, మంత్రాలు, శక్తులతో కరోనాను నయం చేస్తానని అమాయక ప్రజల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేశాడు.

చివరికి మోసాపోయమని తెలుకున్న ప్రజలు పోలీసులను ఆశ్రయించారు.దొంగ బాబా స్థావరాలపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.ఇస్మాయిల్ బాబా మియాపూర్‌లో తాయత్తులు కడుతుంటాడు.

అయితే, మందు లేని కరోనా వైరస్ ధాటికి ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతుండటం గమనించి సోమ్ము చేసుకోవాలనుకున్నాడు.

ఈ నేపథ్యంలో తనకు అతీతమైన శక్తులు ఉన్నాయంటూ తన శిష్యులతో ప్రచారం చేయించారు ఈ కరోనా బాబా అలియాస్ ఇస్మాయిల్.

మాస్క్ పెట్టుకోనక్కర్లేదని, తను ఇచ్చే తాయత్తులు కట్టుకుంటే చాలని నమ్మబలికాడు.ఈ మాయ మాటలు నమ్మిన కొందరు బాబాను ఆశ్రయించారు.

జలుబు, దగ్గు, సాధారణ జ్వరం ఉన్నా.అది కరోనానే అంటూ అమాయకులను భయపెట్టాడు.

తన వద్ద కరోనాకు మందు ఉందని వారి నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడు ఇస్మాయిల్.

అయితే, డబ్బులు కట్టినా కూడా ఎలాంటి మందు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీలోని అతడి స్థావరాలపై దాడి చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

సుమారు 70మంది బాధితులు కరోనా బాబా చేతిలో మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు.ఇలాంటి బూరిడీ బాబాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఇలాంటి వారి గురించి తెలిస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

బిగ్‌బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యేది అప్పుడే.. కంటెస్టెంట్స్ వీళ్లే..??