‘హైదరాబాద్’లో కానిస్టేబుళ్ల కక్కుర్తి.. సస్పెన్షన్ వేటు?
TeluguStop.com
కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం గత రెండు నెలలుగా లాక్ డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంకా అలాంటి ఈ సమయంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు సేవలు గురించి యావత్ ప్రపంచం కీర్తస్తున్న సంగతి తెలిసిందే.
ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం వారు ఎంతో శ్రమిస్తున్నారు.ఇంకా ఇందులో పోలీసుల పాత్ర ఎంతో ఉంది.
అత్యంత కీలకమైన సమయంలో కూడా రాత్రిపగళ్ళు వారు రోడ్డుపై గస్తీ కాస్తూ.జనాలను బయటకు రాకుండా.
గుంపులుగా చేరకుండా ఉండేందుకు వారు ఎంతగానో శ్రమిస్తున్నారు. """/"/
ఇలా ఎంతోమంది పోలీసులు శ్రమిస్తుంటే హైదరాబాద్ లో ఇద్దరు పోలీసులు మాత్రం కక్కుర్తి పడ్డారు.
ఇంకేముంది.ఈ విషయం తెలుసుకున్న అధికారులు సస్సెన్ వేటు వేశారు.
వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పీఎస్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఎంజే మార్కుట్ పరిసరాల్లో ఓ పండ్ల వ్యాపారి ఆటోను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇంకా దాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.ఆ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో విషయం తెలుసుకున్న అధికారులు ఆ ఇద్దరినీ సస్పెండ్ చేశారు.
అయ్యా బాబోయ్.. ఈ కుర్రాళ్లు ఏంటి ఇంత స్పీడ్ గా వడ్డిస్తున్నారు (వీడియో)