Minister Sridhar Babu : లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా హైదరాబాద్..: మంత్రి శ్రీధర్ బాబు

బయో ఆసియా 2024లో( Bio Asia 2024 ) అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అన్నారు.

జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు.బయోలాజికల్ -ఈ అనే విదేశీ సంస్థతో 50 మిలియన్ డోసుల డెంగ్యూ వాక్సిన్( Dengue Vaccine ) కోసం ఒప్పందం జరిగిందని ఆయన తెలిపారు.

ఇప్పటికే ప్రధాన ఫార్మా సంస్థలు బీఎంఎస్, ప్రావిడెన్స్ కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు.తెలంగాణలో పది ఫార్మా క్లస్టర్లు రాబోతున్నాయన్న మంత్రి శ్రీధర్ బాబు ఒక్కో క్లస్టర్ దాదాపు వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల్లో ఏర్పాటవుతాయని చెప్పారు.

"""/" / ఐటీ రంగంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా లైఫ్ సైన్సెస్ పాలసీ( Life Sciences Policy ) తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు.

అలాగే లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా హైదరాబాద్ ను( Hyderabad ) చేయబోతున్నామని, ఎంఎస్ఎంఈ పాలసీ కూడా రాబోతోందని తెలిపారు.

గత ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.పెట్టుబడుల వలన ఉపాధితో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!