ఎల్లమ్మ బోనాల పండుగ ఉత్సవాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
TeluguStop.com
హనుమకొండ జిల్లా కమలాపూర్ లో ఎల్లమ్మ బోనాల పండుగ ఉత్సవాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
స్వగ్రామంలో బోనాల ఉత్సవాలకు హాజరైన ఈటల బొనమెత్తి మొక్కులు చెల్లించుకున్నారు.డప్పు చప్పుళ్లు, ఒగ్గు డోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో బోనాల పండుగ జాతరను తలపించింది.
ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి పట్నాలు వేశారు.ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవాలని, సుఖ సంతోషాలతో పాడిపంటలతో విరాజిల్లేలా ప్రజలను కాపాడాలని ఈటల అమ్మవారిని కోరుకున్నారు.
వైరల్ వీడియో: ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి.. చిన్నారి కాలు పట్టుకుని మరీ