హుజూర్ నగర్ క్రిస్మస్ వేడుకల ప్రేమ విందు

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేమ విందు కార్యక్రమంలో రెవిన్యూ డివిజన్ ఆఫీసర్, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లు,సీఐ చరమందరాజు,పాస్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం క్రిస్టియన్ల కొరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని, స్మశాన వాటికల కోసం గ్రామీణ ప్రాంతాలలో మూడు లక్షల వరకు మంజూరు చేస్తుందని, క్రిస్టియన్ల కొరకు లోన్స్ మంజూరు చేసి కొంత వరకు మాఫీ చేస్తుందని, విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటే ఇరవై లక్షల వరకు సహకారం అందిస్తుందని,పట్టణ ప్రాంతంలో అయితే ఐదు లక్షల వరకు నిధులు కేటాయిస్తుందని,యువతి, యువకులకు ఉపాధి కలిపిస్తుందని,నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ అందిస్తుందన్నారు.

ప్రభుత్వం అందించే వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పొటాటోతో నల్ల మచ్చలు మటాష్.. ఎలా వాడాలంటే?