వివాహిత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం….

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలను కూల్చి వేస్తున్నాయి.తాజాగా ఓ వ్యక్తి  ఉంటున్న నివాసానికి ఉండే పక్కింటిలో ఉండేటువంటి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక ఈ విషయం గూర్చి తన భార్య నిలదీయడంతో ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశంలోని బీహార్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి చంపారన్ అనే ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు.

అయితే వీళ్ళు కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు.

 పెళ్లైన కొత్తలో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు.అఇంతలో ఏమైందో ఏమోగానీ గత కొద్ది కాలంగా ఆ వ్యక్తి వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపాడు.

ఇందులో భాగంగా తాను నివాసం ఉంటున్న ఇంటి పక్కనే ఉంటున్న మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

దీంతో గత కొద్ది కాలంగా భర్త ప్రవర్తనపై అనుమానం కలగడంతో అతడి భార్య వ్యక్తి పై కన్నేసింది.

ఈ క్రమంలో తన భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకుంది.

దీంతో వెంటనే తన భర్తను ఈ విషయం గురించి నిలదీసింది.అంతేగాక వైవాహిక జీవితంలో ఇలాంటి సంబంధాలు మంచిది కాదని మానుకోవాలని చెప్పింది.

అయినప్పటికీ ఆమె భర్త వినకుండా యధావిధిగా పొరుగింటి మహిళతో తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు.

దీంతో భార్యాభర్తలు ఇద్దరూ తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.అయితే తాజాగా మరోసారి ఈ విషయంపై గొడవ జరగడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వ్యక్తి తన భార్యను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.

అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా పరారీలో ఉన్నటువంటి మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా నేరం అంగీకరించాడు.

 .

జగన్ జిల్లా పర్యటనలు .. క్యాడర్ కు ఆసక్తి లేదా ?