పిల్లలు పుట్టలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త...

పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని ఓ  భర్త ఏకంగా తన భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే జిల్లాలోని కోవెలకుంట్ల గ్రామ మండలానికి చెందినటువంటి నాగ జ్యోతి అనే మహిళకు అదే ప్రాంతానికి చెందినటువంటి సోమశేఖర్ అనే వ్యక్తితో ఎనిమిదేళ్ళ క్రితం వివాహం అయ్యింది.

అయితే మొదట్లో వీరి సంసారం సాఫీగానే సాగిపోయింది.ఈ క్రమంలో ఏళ్ళు గడుస్తున్నకొద్దీ నాగజ్యోతికి పిల్లలు పుట్టక పోవడంతో ఆమె భర్త నాగజ్యోతిపై అనుమానం పెంచుకున్నాడు.

అలాగే ఆమెను తనకు పిల్లలు కావాలంటూ వేధించేవాడు.ఈ విషయమై భార్యాభర్తలు ఇద్దరూ తరచూ గొడవ పడేవారు.

దీంతో పలు మార్లు పెద్దలు పిలిచి ఇద్దరికీ సర్దిచెప్పి పంపించే వాళ్ళు. """/"/ అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా నాగజ్యోతి గొడవ పడి ఇ తన పుట్టింటికి వచ్చేసింది.

దీంతో పెద్దలు సర్దిచెప్పి మళ్లీ నాగ జ్యోతిని సోమశేఖర్ తో కాపురానికి పంపించారు.

భార్య పై ద్వేషం పెంచుకున్న టువంటి ఆమె భర్త సోమశేఖర్ నాగజ్యోతి నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి హత్య చేశాడు ఆ తర్వాత నాగజ్యోతి ఆత్మహత్య చేసుకుందనేవిధ్ంగా అందర్నీ నమ్మించడానికి ఆమెను ఉరివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

దీంతో అనుమానం వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సోమశేఖర్ పై ఫిర్యాదు నమోదు చేశారు.

ఫిర్యాదు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు సోమశేఖర్ ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా పథకం ప్రకారమే నాగజ్యోతిని హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు.

దీంతో అతడిని అరెస్టు చేసి ఇ రిమాండుకు తరలించారు.

డాకు మహారాజ్ తర్వాత బాబీ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడా..?