అనుమానమే ఆ కుటుంబానికి శాపం.. ప్రాణాలు కోల్పోయి ఒకరు.. ప్రాణపాయ స్థితిలో మరొకరు..!
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో అనుమానం అనేది విపరీతంగా పెరిగి కుటుంబాలనే నాశనం చేసేస్తుంది.చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, అనుమానాలతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అభం శుభం తెలియని చిన్నారులు సైతం రోడ్డున పడుతున్నారు.
ఒక కుటుంబానికి అనుమానమే శాపంగా మారి ఒకరు ప్రాణాలు కోల్పోతే, మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస చోటుచేసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం రామారావు(60), సూర్యం(50) దంపతులు ఆముదాలవలస మున్సిపాలిటీ ఐదో వార్డు సొట్ట వాని పేట కొత్త కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఈ దంపతులకు 30 సంవత్సరాల క్రితం వివాహమయ్యింది.వీరికి అప్పన్న,రాంబాబు, పున్నమ్మ, విజయ అనే నలుగురు పిల్లలు సంతానం.
"""/" /
అయితే వీరిలో పెద్ద కుమారుడు అప్పన్న, పెద్ద కుమార్తె పున్నమ్మలకు వివాహం అయింది.
ఇంకా ఇద్దరికీ వివాహం జరగాల్సి ఉంది.మనవడు లేదా మనవరాలు తో సంతోషంగా ఆడుకునే వయసులో రామారావు, భార్య సూర్యం అక్రమ సంబంధం పెట్టుకుందేమో అని అనుమానం పెంచుకున్నాడు.
ఇక తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి.శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఇద్దరు కుమారులు బయటకు వెళ్లారు.
ఇక శుక్రవారం రోజు కూడా ఈ దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది ఆ సమయంలో """/" /
ఇంట్లో భార్య సూర్యంతో పాటు చిన్న కుమార్తె విజయ ఇంకా కోడలు భారతి ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గొడవ పెరిగి రామారావు కత్తితో భార్యపై దాడి చేస్తుండగా మధ్యలో వచ్చిన చిన్న కుమార్తె విజయకు కత్తి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
ఇక భార్య కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంది.కోడలు భారతి బయటకు వచ్చే చూసి సరికి ఆడపడుచు, అత్త రక్తం మడుగులో ఉండడం తో భయంతో ఇద్దరు పిల్లలు తీసుకొని బయటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చారు.
ఇక సూర్యంను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.రామారావు పరారీలో ఉన్నాడు.
కోడలు భారతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.